BAI : ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్(AJBC) మరో వారంలో మొదలవ్వనుంది. చైనా ఆతిథ్యమిస్తున్న ప్రతిష్ఠాత్మక ఈ టోర్నమెంట్ కోసం భారత్ 39 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేసింది. ఇందులో అండర్ -15, అండర్ -17 విభాగాలకు చెందిన షట్లర్లు ఉన్నారు. ఆగస్టు 20 నుంచి 25వ తేదీ వరకు ఈ టోర్నీ జరుగనుంది.
అందుకని ఆగస్టు 17 శనివారం రోజు కోచింగ్ సిబ్బందితో కలిసి ఇండియా షట్లర్లు చైనా విమానం ఎక్కారు. వచ్చే ఏడాది స్వదేశంలో జరుగబోయే వరల్డ్ జూనియర్ చాంపియన్‌షిప్ (World Junior Championship) ఉన్నందున ఈ ఈవెంట్‌ను భారత షట్లర్లు సవాల్‌గా తీసుకుకోనున్నారు.
అబ్బాయిల సింగిల్స్ శ్యామ్ బిండిగనవిలే, శశాంక్ వనమల, ప్రగ్యాన్ చౌదరీ, పుష్కర్ సాయి.
అమ్మాయిల సింగిల్స్ తన్వీ పత్రి, షైనా మనిముతు, గతా సుర్యవంశీ, హితయ్శ్రీ ఎల్ రాజయ్య.
అబ్బాయిల డబుల్స్ – రాహుల్ కడపకుల, వేదాంత్ పహ్వా, శశ్వాత్ చౌదరీ, శౌర్య చౌదరీ.
అమ్మాయిల డబుల్స్ – షైనా మనిముతు, ఐక్య శెట్టి, నిధి అత్మారామ్, సెల్వసముద్రి సెల్వప్రభు.
మిక్స్డ్ డబుల్స్ – షాహిద్ ఇబ్రహీం పీర్ దీశితా సింగా గోపినాథ్ సింగ్, కవెయుగన్ కేఏ అనుష్కా జెన్నిఫర్ ఏఎస్.
అబ్బాయిల సింగిల్స్ – జ్ఝాన దట్టు టీటీ, ప్రతీక్ కౌండిల్య, దేవ్ రుపరెలియ, అభినవ్ గార్గ్.
అమ్మాయిల సింగిల్స్ – తన్వీ రెడ్డి అడ్లూరి, ఆదర్శిని శ్రీ ఎన్బీ, పరుల్ చౌదరీ, దుర్గా ఇషా కండ్రపు.
పురుషుల డబుల్స్ – జ్రోన్ జైసన్ అథిశ్ శ్రీనివాస్ పీవీ, అభినవ్ కుండారి యోగాన్ష్ సింగ్.
అమ్మాయిల డబుల్స్ – అన్నయ బిష్త్, అంజెలా పునెర, దియా భీమయ్య బీ, బరుని పర్ష్వల్.
మిక్స్డ్ డబుల్స్ – శౌర్య కిరణ్ జే, కీర్తి మంచాల, మనిశ్ రెడ్డి. దీపక్ రాజ్ అదితి.
నిరుడు జరిగిన బీఏసీ చాంపియన్‌షిప్స్‌లో భారత్ ఒక్కో పసిడి, వెండి, కాంస్యం పతకం సాధించింది. అండర్ -15 బాలుర సింగిల్స్‌లో బొర్నిల్ ఛాంగ్మై(Bornil ChangmaI) స్వర్ణంతో మెరిశాడు. ఈసారి మరిన్ని పతకాలపై షట్లర్లు గురి పెట్టారు. అందుకోసం గువాహటిలోని జాతీయ సెంటర్లో కఠినంగా సాధన చేశారు.
బొర్నిల్ ఛాంగ్మై
అండర్ -15 సింగిల్స్ విభాగంలో శ్యామ్ బిండిగనవిలె, తన్వీ పత్రీలు టాప్ సీడ్లుగా బరిలోకి దిగనున్నారు. ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్ కోసం భారత్ బలమైన బృందాన్ని ఎంపిక చేసింది. ఈసారి మనం ఎక్కువ సంఖ్యలో పతకాలు సాధిస్తామని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే.. ఈ టోర్నీ కోసం క్రీడాకారులతో పాటు కోచ్‌లు కూడా చాలా కష్టపడ్డారు అని బాయ్ సెక్రటరీ సంజయ్ మిశ్రా అన్నారు.