Shah Rukh Khan | అభిమానులను అలరించాలంటే హీరోలకు ఫిట్నెస్ చాలా అవసరం. వయసు పైబడుతున్న కొద్దీ.. బాడీని కంట్రోల్లో ఉంచుకోవడం చాలా కష్టం. అలాంటిది 58 ఏండ్ల వయసులోనూ ఫిట్‌గా కనిపిస్తాడు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్.
వరుసగా జవాన్, పఠాన్ హిట్లు కొట్టి తన స్టామినాను మరోసారి నిరూపించుకున్నాడు. ఈ రెండు యాక్షన్ సినిమాల్లోనూ ఎనర్జిటిక్‌గా అలరించిన షారుఖ్ పవర్ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలని అభిమానులు ఆరాటపడుతుంటారు. వారందరినీ ఆశ్చర్యపరుస్తూ తన ఫిట్నెస్ రహస్యాలను బయటపెట్టాడు షారుఖ్.
‘అమెరికన్ నటుడు మార్క్ వాల్బర్గ్ నిద్ర నుంచి లేచే సమయానికి నేను నిద్రపోతాను. షూటింగులు పూర్తి చేసుకుని అర్ధరాత్రి 2 గంటలకు ఇంటికి చేరుకుంటా. స్నానం చేసి, కాసేపు వర్కవుట్లు చేసి.. తెల్లవారుజామున 5 గంటలకు నిద్రపోతా. పది గంటలకల్లా లేచి… మళ్లీ రెడీ అయ్యి షూటింగ్‌కు వెళ్లిపోతాను. తక్కువ ఆహారం తీసుకుంటాను. పోషక విలువలు ఉండేలా చూసుకుంటాను’ అని చెప్పుకొచ్చాడు కింగ్ ఖాన్.