IPL – ECB : ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎంత పాపులరో తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్స్‌కు బీజం వేసిన ఐపీఎల్ (IPL) విజయవంతంగా సాగుతోంది. అంతేనా.. ఐపీఎల్ ఫ్రాంచైజీలు భారత్‌కే పరిమితం కాకుండా పలు దేశాల లీగ్స్‌లోనూ ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (England Cricket Board) ఐపీఎల్ జట్లకు బంపర్ ఆఫర్ ఇచ్చింది.
‘ది హండ్రెడ్ లీగ్’ (The Hundred League)లో షేర్లు కొంటే చాలు జట్ల పేర్లను మార్చుకోవచ్చని ఈసీబీ తెలిపింది. ఫ్రాంచైజీ క్రికెట్‌కు ఐపీఎల్ బ్రాండ్ అంబాసిడర్ అయింది. అందుకని ఐపీఎల్ జట్ల పేరుతో తమ హండ్రెడ్ లీగ్‌కు మరింత గుర్తింపు తెచ్చుకోవాలని ఇంగ్లండ్ క్రికెట్ సిద్దమైంది.
The England Cricket Board likely to allow IPL owners to rename the The Hundred teams if they buy stakes.
– TOIOne thing is sure indian franchise owners rule franchise Cricket all over the world.
— CRICKET STATS (@fantasy1Cricket) August 17, 2024
సో.. తమ లీగ్‌లో వాటాలు కొనాల్సిందిగా ఐపీఎల్ యజమానులను కోరుతోంది. వాళ్లు చిన్నమొత్తంలో షేర్లు సరే ఆయా జట్ల పేర్లను మార్చుకునేందుకు అనుమతి ఇవ్వనుంది. ఇప్పటికే దక్షిణాఫ్రికా టీ20, ఇంటర్నేషనల్ టీ20, మేజర్ క్రికెట్ లీగ్.. ఇలా పలు లీగ్స్‌లో ఐపీఎల్ జట్ల సిస్టర్ టీమ్స్ ఆడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ది హండ్రెడ్ లీగ్‌లో 8 జట్లు ఆడుతున్నాయి. అవి ఏంటంటే.. నార్తర్న్ సూపర్ చార్జర్స్, లండన్ స్పిరిట్, బర్మింగ్హమ్ ఫీనిక్స్, వెల్ష్ ఫైర్, ట్రెంట్ రాకెట్స్, మాంచెస్టర్ ఒరిజినల్స్, సదర్న్ బ్రేవ్, ఓవల్ ఇన్సివిసిబుల్స్.