తిమ్మాపూర్, జనవరి 5: ప్రస్తుత ప్రభుత్వంలో ఉద్యోగులపై పనిఒత్తిడి పెరుగుతున్నదని కాళేశ్వరం ఇన్చార్జి సీఈ శ్రీనివాస్ గుప్తా పేర్కొన్నారు. ప్రభుత్వం గతంలో మాదిరిగా సంప్రదాయాలను పాటించడం లేదని తెలిపారు. సోమవారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండీ కాలనీలోని ఎస్ఈ సమావేశ మందిరంలో టీఎన్జీవో నేతలతో కలిసి టీఎన్జీవో తిమ్మాపూర్ యూనిట్ క్యాలెండర్, వాల్‌పోస్టర్‌ను ఆవిషరించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ.. అద్దె భవనాలను ఖాళీ చేయాలనే నిర్ణయంతో అధికారులు, ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నట్టు తెలిపారు. టీఎన్జీవో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దారం శ్రీనివాసరెడ్డి, సంగెం లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు రాష్ట్ర స్థాయిలోనే పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. పెండింగ్ బిల్లులు, టీఏ, డీఏ, పీఆర్సీ, హెచ్ఆర్ఏ, హెల్త్కార్జుల కోసం ధర్నా చేసే పరిస్థితి నెలకొన్నదని పేర్కొన్నారు.