హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగ విరమణ బెనిఫిట్స్ ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డిని కలిసేందుకు బయల్దేరిన రిటైర్డ్ ఉద్యోగుల అరెస్ట్ అమానుషమని ఉద్యోగ సంఘాల మాజీ నేత దేవీప్రసాద్ ఖండించారు. ముఖ్యమంత్రికి కష్టాలు చెప్పుకొనేందుకు అవకాశం ఇవ్వకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2024 మార్చి నుంచి 20,503 మంది ఉద్యోగులకు రావాల్సిన పెన్షన్ బకాయిలు విడుదల చేయక పోవడం దుర్మార్గమని మండిపడ్డారు. ఇప్పటికైనా సర్కార్ స్పందించి ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఐదు డీఏలు, పీఆర్సీ, రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.