HMDA | హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ) : ఉస్మానియా దవాఖానను గోషామహల్ స్టేడియానికి తరలించే నిర్ణయంపై మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయకపోతే జరిమానా విధిస్తామని హెచ్ఎండీఏను హైకోర్టు హెచ్చరించింది. పలుసార్లు గడువు ఇచ్చామని, మళ్లీ గడువు కోరడమేంటని ప్రశ్నించింది. గోషామహల్ స్టేడియం స్థలాన్ని కొత్త భవనం నిర్మాణానికి కేటాయిస్తూ ప్రభుత్వం జనవరిలో జీవో 45 జారీచేసింది. దీనిని సవాల్ చేస్తూ జీ రాము దాఖలు చేసిన పిల్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ మొహియుద్దీన్‌తో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. విచారణను 3 వారాలు వాయిదా వేసింది.
హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): కొత్తగా నిర్మిస్తున్న ఉస్మానియా దవాఖానను నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్ ఆదేశించారు. సోమవారం ఆయన దవాఖాన పనులను పరిశీలించారు. దవాఖాన పరిధిలోని 56 నిర్మాణాలను వచ్చే నెలాఖరులోగా తొలగించనున్నట్టు అధికారులు వికాస్‌రాజ్‌కు చెప్పారు.