హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ) : అల్పాదాయ వర్గాల (ఎల్ఐజీ) కోసం హైదరాబాద్ గచ్చిబౌలిలో నిర్మించిన 111 ఫ్లాట్లను మంగళవారం ఆన్లైన్ లాటరీ పద్ధతిలో ఎంపికైన వారికి కేటాయించనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఫ్లాట్లను కొనుగోలు చేసేందుకు 2,685 దరఖాస్తులు వచ్చాయని, లాటరీని ఆన్లైన్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నామని చెప్పారు.
హైదరాబాద్, వరంగల్, ఖమ్మం తదితర చోట్ల నిర్మించిన ఫ్లాట్ల విక్రయానికి హౌసింగ్ బోర్డు డిసెంబర్ 16న నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. 8న వరంగల్, 10న ఖమ్మంలోని ఫ్లాట్లకు ఆన్లైన్ లాటరీ నిర్వహించనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ప్రజల విజ్ఞప్తి మేరకు ఖమ్మంలోని ఫ్లాట్లకు దరఖాస్తుల స్వీకరణ తేదీని ఈనెల 8 వరకు పొడిగించినట్టు వెల్లడించారు.