Ulhas Satyanarayan : భారత బాస్కెట్ బాల్ క్రీడాకారుడు ఉల్హాస్ సత్యనారాయణ్ (Ulhas Satyanarayan ) అరుదైన ఘనతకు చేరువయ్యాడు. ప్రతిష్ఠాత్మక యూరోపియన్ బాస్కెట్‌బాల్ లీగ్(European Basketball League)లో చాన్స్ కొట్టేశాడు. సెర్బియా లీగ్ డివిజన్ 1 టోర్నమెంట్లో అతడు ఆడనున్నాడు. తద్వారా ఈ లీగ్‌లో పాల్గొంటున్న తొలి భారతీయుడిగా సత్యనారాయణ్ చరిత్ర సృష్టించనున్నాడు. ఈ ఏడాది అక్టోబర్ 3 నుంచి టోర్నీ మొదలవ్వనుంది.
సెర్బియాకు చెందిన కొసర్కస్కే లిజె సెర్బిజ్ క్లబ్ సత్యనారాయణతో ఒప్పందం చేసుకుంది. దాంతో, నొవి పజర్ సాలమాండర్(Novi Pazar Salamander) జట్టు తరఫున అతడు బరిలోకి దిగనున్నాడు. 2024-25 సీజన్లో అతడు కనీసం మూడు నుంచి ఏడు నెలల పాటు ఈ జట్టుతో కొనసాగే అవకాశముంది. ఈ స్టార్ ప్లేయర్ త్వరలోనే సెర్బియా దేశం తరఫున బరిలోకి దిగనున్నాడు.
Congratulations to Ulhas koravi Satyanarayan, on being the first Indian to play in a professional European basketball league! Beyond cricket our stars are rising and making us proud day by day. The boy with Tamilnadu as his roots will be playing in the Serbian basketball league… pic.twitter.com/guYZ5XJOcW
— Vinoj P Selvam (@VinojBJP) August 13, 2024
తమిళనాడులోని కాంచీపురంలో జన్మించిన సత్యనారాయణ్ జిడీ గొయెంకా పబ్లిక్ స్కూల్లో చదివాడు. ఓ వైపు చదువులో రాణిస్తూనే బాస్కెట్‌బాల్ మీద దృష్టిపెట్టాడు. అన్ని కేటగిరీల్లో అత్యుత్తమ ప్రదర్శనతో అదరగొట్టాడు. 2016లో లండన్‌లో వెస్ట్‌మినిస్టర్ స్కూల్లో బిజినెస్ చేరిన అతడు అక్కడి వెస్ట్‌మినిస్టర్ డ్రాగన్స్ జట్టుకు ఆడాడు. డ్రాగన్స్ తరఫున టైటిల్ గెలిచిన సత్యనారాయణ్ ఆ తర్వాత ఇంగ్లండ్ జాతీయ బాస్కెట్‌బాల్ లీగ్‌లోనూ మెరిశాడు. ఇప్పుడు ఏకంగా యూరోపియన్ బాస్కెట్‌బాల్ లీగ్‌లో ఆడే చాన్స్ పట్టేశాడు.