Kolkata Doctor Case | స్తంభించిన వైద్య సేవలు.. కోల్‌కతా ఘటనకు వ్యతిరేకంగా యూకే, బంగ్లాలోనూ నిరసనలు
కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై లైంగిక దాడి, హత్య ఘటనపై దేశవ్యాప్తంగా వైద్యులు, వైద్యసిబ్బంది ఆందోళనకు దిగారు.
- కోల్‌కతా ఘటనకు నిరసనగా అన్ని రాష్ర్టాల్లో డాక్టర్ల ఆందోళనలు
- యూకే, బంగ్లాదేశ్‌ల్లోనూ ప్రదర్శనలు
- కేంద్రం ముందు ఐదు డిమాండ్లు
- కమిటీ వేస్తామన్న ప్రభుత్వం
న్యూఢిల్లీ/కోల్‌కతా, ఆగస్టు 17: కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై లైంగిక దాడి, హత్య ఘటనపై దేశవ్యాప్తంగా వైద్యులు, వైద్యసిబ్బంది ఆందోళనకు దిగారు. శనివారం 24 గంటల సమ్మె నిర్వహించారు. దీంతో వైద్యసేవలు స్తంభించిపోయాయి. అన్ని రాష్ర్టాల్లోనూ వైద్యులు, వైద్య విద్యార్థులు, సిబ్బంది విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. వైద్యుల సమ్మెతో అనేక దవాఖానాల్లో ఓపీ, డిస్పెన్సరీ వంటి వైద్యసేవలు నిలిచిపోయాయి.
ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఐసీయూ, ఎమర్జెన్సీ విభాగం, ఆపరేషన్ థియేటర్ల కార్యకలాపాలను మాత్రం వైద్యులు కొనసాగించారు. కోల్‌కతా ఘటనను సుమోటోగా తీసుకొని విచారణ జరపాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు మూడు లేఖలు అందాయి. కాగా, గుజరాత్‌లోని అమ్రేలీలో వైద్యుల నిరసన కార్యక్రమంలో తన లైసెన్డ్స్ తుపాకీని ప్రదర్శించారనే ఆరోపణలతో జీజే జజీరా అనే వైద్యుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
యూకే, బంగ్లాలోనూ నిరసనలు
కోల్‌కతా ఘటనకు వ్యతిరేకంగా విదేశాల్లోనూ నిరసనలు జరిగాయి. యూకేలో భారతీయ వైద్యులు, వైద్య విద్యార్థులు లండన్‌లోని ఇండియా హౌస్ ముందు శాంతియుత నిరసన తెలిపారు. బంగ్లాదేశ్‌లోని ఢాకా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు నిరసన తెలిపారు.
నిరసనలు విరమించండి: కేంద్రం
వైద్యుల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర వైద్య శాఖ స్పందించింది. శనివారం ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు కేంద్ర వైద్య శాఖ అధికారులతో సమావేశమయ్యారు. కేంద్రం ముందు వైద్యుల సంఘాలు ఐదు డిమాండ్లను పెట్టాయి. ఈ డిమాండ్లపై ఒక కమిటీని వేసి సంప్రదింపులు జరుపుతామని కేంద్ర వైద్య శాఖ తెలిపింది. నిరసనలు విరమించుకోవాలని కోరింది.
నిరసనల వేళ వైద్యుల బదిలీలు
జూనియర్ డాక్టర్ హత్య ఘటనపై పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న వేళ 42 మంది వైద్యులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వివాదంగా మారింది. ఆందోళనను అణిచివేసేందుకే నిరసనల్లో చురుగ్గా పాల్గొంటున్న వైద్యులను బదిలీ చేశారని వైద్య సంఘాలు ఆరోపించాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

