UPSC | న్యూఢిల్లీ, ఆగస్టు 17: కేంద్ర ఆర్థిక శాఖ, హోం, వ్యవసాయం, విద్య..ఇలా వివిధ శాఖల్లో పోస్టుల భర్తీకి యూపీఎస్స్సీ ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. ప్రైవేట్ రంగ ఉద్యోగుల నుంచి కూడా వీటికి దరఖాస్తులు స్వీకరించబోతున్నది. సెక్రెటరీ, డిప్యూటీ సెక్రెటరీ, డైరెక్టర్ స్థాయిలోని 45 లేటరల్ ఎంట్రీ పోస్టుల భర్తీకి సంబంధించి యూపీఎస్సీ దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. వీటికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అర్హులు కాదని పేర్కొన్నది.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వర్సిటీలు, పీఎస్యూలు, స్వతంత్ర సంస్థలు, ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నవారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు తెలిపింది. 10 జాయింట్ సెక్రెటరీ, 35 డైరెక్టరీ, డిప్యూటీ సెక్రెటరీ స్థాయి పోస్టుల దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 17. సంబంధిత రంగంలో కనీసం 10, 15 ఏండ్ల అనుభవం ఉండాలని నోటిఫికేషన్ పేర్కొన్నది. డిప్యూటేషన్, కాంట్రాక్ట్ విధానంలో కనీసం 3 ఏండ్లు, గరిష్ఠంగా 5 ఏండ్లు పనిచేయాల్సి ఉంటుందని తెలిపింది.