DSC | ఆర్టీఐ యాక్ట్ ప్రత్యేకావసరాల పిల్లలకా?.. డీఎస్సీ ప్రాథమిక ‘కీ’లో తప్పులు
‘రైట్ టూ ఇన్ఫర్మేషన్ యాక్ట్' దీనినే తెలుగులో సమాచార హక్కు చట్టం అంటారు. కానీ ఈ యాక్ట్ ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యకు సంబంధించినదట. ఈ చట్టం వారి కోసం కూడా రూపొందించారట.
DSC | హైదరాబాద్/జగిత్యాల, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ) : ‘రైట్ టూ ఇన్ఫర్మేషన్ యాక్ట్’ దీనినే తెలుగులో సమాచార హక్కు చట్టం అంటారు. కానీ ఈ యాక్ట్ ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యకు సంబంధించినదట. ఈ చట్టం వారి కోసం కూడా రూపొందించారట. ఇది ఇటీవల నిర్వహించిన డీఎస్సీ రిక్రూట్మెంట్లో ఓ ప్రశ్నకు ఇచ్చిన సమాధానం. డీఎస్సీ రిక్రూట్మెంట్ పరీక్షలో ప్రత్యేకావసరాలు గల పిల్లల విద్యకు సంబంధించిన ఏ చట్టం అసంబద్ధం అన్న ప్రశ్ననిచ్చారు.
ఆప్షన్లుగా ఆర్టీఐ యాక్ట్, ఆర్సీఐ యాక్ట్, ఆర్టీఈ యాక్ట్, ఆర్పీడబ్ల్యూడీ యాక్ట్ అని ఇచ్చారు. వాస్తవానికి ఒక్క ఆర్టీఐ యాక్ట్ తప్ప మిగతా చట్టాలన్నింటిని ప్రత్యేకావసరాలు గల వారి కోసం రూపొందించారు. కానీ విద్యాశాఖ అధికారులు మాత్రం ఆర్పీడబ్ల్యూడీ యాక్ట్ సరైన సమాధానమని ఇచ్చారు. ఇది తప్పు అని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ADHD యొక్క పూర్తి రూపం ‘అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజాస్టర్’ కాగా, బదులుగా మాస్టర్ ‘కీ’లో మాత్రం ‘ఆటో డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజాస్టర్’ సరైన సమాధానంగా ప్రకటించారు. యూడీఎల్ యొక్క ప్రధాన సూత్రం ఏదీ అన్న ప్రశ్నకు ఇచ్చిన ఆన్సర్పైనా అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు.
18 వరకు తప్పులు..
డీఎస్సీ ప్రశ్నపత్రాల్లో ఒకే పేపర్లో 18 వరకు తప్పులున్నట్టు అభ్యర్థులు చెబుతున్నారు. ప్రధానంగా స్పెషల్ ఎడ్యుకేషన్(స్కూల్ అసిస్టెంట్) పరీక్ష మాస్టర్ ‘కీ’లో 160 ప్రశ్నలకు ఇచ్చిన ప్రాథమిక కీలో అత్యధిక తప్పులున్నాయని అభ్యర్థులు చెబుతున్నారు. ప్రశ్నపత్రం రూపకల్పనపైనా అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు. జీవో-4 ప్రకారం ఒక్కో విభాగం నుంచి 20 ప్రశ్నలు మాత్రమే ఇవ్వాల్సి ఉండగా, అలా ఇవ్వలేదని, ఒక్క లర్నింగ్ డిసెబిలిటీలో 35 వరకు ప్రశ్నలిచ్చారని ఇది అత్యంత దారుణమని అభ్యర్థులు వాపోతున్నారు.
అంతా గందరగోళం..
తెలుగు గ్రేడ్-1 పరీక్ష ప్రశ్నపత్రంలో 52వ ప్రశ్నగా ‘గౌరీశ్వరులు అనే పదాన్ని విడదీయగా’ అని ఇచ్చారు. దీనికి 71505321007 క్వశ్చన్ ఐడీ నంబర్‌ను కేటాయించారు. ఆప్షన్‌గా 2వ నంబర్‌ను పేర్కొన్నారు. అయితే కీ పత్రంలోని జవాబులో మాత్రం సరైన సమాధానంగా 4వ నంబర్(గ్రీన్ కలర్)తో గౌరీ+ఈశ్వరులు అని పేర్కొన్నారు. అయితే ఈ ప్రశ్నలో సరైన సమాధానం 2వ నంబర్‌గా నిపుణులు పేర్కొంటున్నారు. ‘కీ’ లో తెలుగు పండిత పరీక్షకు సంబంధించి 5 ప్రశ్నలకు సమాధానాలు ఇలానే తప్పుగా ఇచ్చారు.
కాగా డీఎస్సీ ‘కీ’ పత్రంపై అభ్యంతరాలు ఉంటే, ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చునని, అవసరమైతే మెయిల్ లేదా ఫోన్ చేయవచ్చునంటూ మెయిల్ అడ్రస్‌లతో పాటు, ఫోన్ నంబర్లను సైతం ఇచ్చింది. ఫిర్యాదు చేసేందుకు యత్నిస్తే.. సరైన సమాధానం రావడం లేదని అభ్యర్థులు వాపోతున్నారు. ‘కీ’లో వచ్చిన అంశాలపై ఆన్లైన్లో అభ్యంతరం వ్యక్తం చేయడానికి వీలు లేని పరిస్థితి ఉందని ఆందోళన చెందుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- DSC
- key answer
- RTI ACT
- Telangana
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

