Rashmika Mandanna | చిన్న సినిమాలతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక అనతికాలంలోనే టాప్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. ‘పుష్ప’తో నేషనల్ క్రష్‌గా ఎదిగింది. అయితే ఈ స్టేజీకి అంత ఈజీగా రాలేదని చెబుతున్నది ఈ కన్నడ సౌందర్యం.
‘హీరోయిన్ అవకాశం కోసం ఎన్నో ఆడిషన్స్ ఇచ్చాను. సుమారు 25 వరకు ఆడిషన్స్‌కు వెళ్లానేమో! అన్నిటిలోనూ రిజెక్ట్ చేసేవారు. నా నటనపై వాళ్లకు ఎప్పుడూ అనుమానం ఉండేది. దాన్నే నేను తట్టుకోలేక పోయేదాన్ని. సెలెక్ట్ కాలేదని తెలిసిన తర్వాత కన్నీళ్లు ఆగేవి కాదు. ఏడుస్తూ ఇంటికి వెళ్లేదాన్ని. ఓ సినిమా కోసం చాలాసార్లు ఆడిషన్ చేశారు.
చివరికి సెలెక్ట్ అయ్యాను. మూడు నెలలపాటు ఆ సినిమాకు సంబంధించిన వర్క్‌షాప్స్ జరిగాయి. ఇంత కష్టపడ్డ తర్వాత ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. ఇలా ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా. నన్ను నేను మెరుగుపర్చుకుంటూ ఈ స్థాయికి చేరుకున్నా’ అని చెప్పుకొచ్చింది రష్మిక. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘పుష్ప: ది రూల్’, విక్కీ కౌశల్ నటిస్తున్న ‘చవ్వా’, సల్మాన్ ఖాన్ ‘సికిందర్’, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కుబేర’ సినిమాల్లో నటిస్తున్నది.