P. Susheela | ప్రముఖ గాయని పీ.సుశీలకు అస్వస్థత..
P. Susheela | ప్రముఖ నేపథ్య గాయని పీ.సుశీల అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమె చెన్నై మైలాపూర్‌లోని కావేరి దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉన్నదని తెలుస్తున్నది.
P. Susheela | ప్రముఖ నేపథ్య గాయని పీ.సుశీల (P. Susheela) అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమె చెన్నై మైలాపూర్‌లోని కావేరి దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉన్నదని తెలుస్తున్నది. కడుపునొప్పి కారణంగా హాస్పిటల్లో చేరినట్లు వైద్యసిబ్బంది వెల్లడించారు. అది సాధారణ కడుపునొప్పేనని, ఆమె ఆరోగ్యంగానే ఉన్నారని పేర్కొన్నారు. ఇందులో ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని తెలిపారు. 86 ఏండ్ల సుశీల.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె ఆరోగ్య విషయమై సినీవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
పద్మభూషణ్ గ్రహీత అయిన సుశీల.. సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. తెలుగు సినీవినీలాకాశంలో ఎన్నో అద్భుతమైన పాటలు ఆలపించి సంగీత ప్రియులను ఉర్రూత లూగించారు. ఆమె తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో సహా మొత్తం 9 భాషలలో 40 వేలకుపైగా పాటలు పాడారు. తన అద్భుత స్వరంతో అభిమానులను కట్టిపడేశారు. ఉష్రేష్ మన్మాన్ చిత్రంలోని ‘లైక్ పాల్’ అనే పాటకు ఆమె మొదటిసారిగా ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్‌గా జాతీయ అవార్డు గెలుచుకున్నారు. కాగా, వయోభారంతో గత కొంతకాలంగా ఆమె పాటలు పాడడం మానేసి పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

