Vinesh Phogat | భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ (Vinesh Phogat) ఆసుపత్రిలో చేరినట్లు (hospitalised) తెలిసింది. డీహైడ్రేషన్ (dehydration) కారణంగా తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం. దీంతో ఆమెను అధికారులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. బరువు తగ్గడం కోసం ఫొగాట్ రాత్రంతా స్కిప్పింగ్, సైక్లింగ్, జాగింగ్ చేశారని.. దాని కారణంగా డీహైడ్రేషన్‌తో అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ప్రస్తుతం పారిస్‌లోని ఆసుపత్రిలో వినేశ్ చికిత్స తీసుకుంటున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.
Vinesh Phogat faints and has been hospitalised in Paris due to dehydration
Just feel for Vinesh, absolutely heartbroken 💔😭 pic.twitter.com/p3JItVlHjg
— The Khel India (@TheKhelIndia) August 7, 2024
కాగా, రెజ్లింగ్ ఫైనల్‌కు (Indian wrestler) చేరిన వినేశ్ ఫొగాట్ (Vinesh Phogat)పై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే (Olympic disqualification). 50 కేజీల ఫ్రీ స్టయిల్ రెజ్లింగ్‌లో పోటీ చేసిన వినేశ్ ఫొగాట్.. ఫైనల్‌కి ప్రవేశించింది. నంబర్ వన్ రెజ్లర్ సుసాకిపై విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. దీంతో అంతా పతకం ఖాయమని అనుకున్నారు. అయితే, అనూహ్యంగా బరువు పెరిగిన కారణంగా ఫొగాట్‌పై అనర్హత వేటు పడింది. ఫైనల్ గేమ్‌కు కొద్ది క్షణాల ముందు ఈ పరిణామం చోటు చేసుకుంది.
నిబంధనల ప్రకారం ఉండాల్సిన 50 కేజీల బరువు కంటే ఫొగాట్ 100 గ్రాములు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆమెపై అనర్హత వేటు వేస్తూ ఒలింపిక్ కమిటీ, రెజ్లింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నాయి. అనర్హత కారణంగా ఆమె పతకం గెలిచే అవకాశం కోల్పోయింది. ఫొగాట్‌పై అనర్హత వేటు పడటం సర్వత్రా షాక్‌కు గురి చేస్తోంది.
Also Read..
PM Modi: రెజ్లర్ వినేశ్ ఫోగట్‌పై వేటు బాధిపెడుతోంది: ప్రధాని మోదీ
Vinesh Phogat | రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పతకం ఆశలు గల్లంతు.. అధిక బరువు కారణంగా అనర్హత వేటు..!