PM Modi: రెజ్లర్ వినేశ్ ఫోగట్‌పై వేటు బాధపెడుతోంది: ప్రధాని మోదీ
PM Narendra Modi: రెజ్లర్ వినేశ్ ఫోగట్‌పై ఒలింపిక్ సంఘం వేటు వేసిన నేపథ్యంలో ప్రధాని మోదీ స్పందించారు. వినేశ్ చాంపియన్లకే చాంపియన్ అని ఆయన అన్నారు. పోగట్‌పై వేటు బాధిస్తోందన్నారు. నువ్వు భారత దేశానికి గర్వకారణమని, ప్రతి ఒక్క భారతీయుడికి ప్రేరణగా నిలుస్తున్నావని తెలిపారు.
న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్ స్వర్ణ పతకాన్ని గెలుచుకునే అవకాశాన్ని రెజ్లర్ వినేశ్ ఫోగట్ చేజార్చుకున్నది. ఓవర్ వెయిట్ కారణంగా ఆమెను అనర్హురాలిగా ప్రకటించారు. వాస్తవానికి ఇవాళ ఆమె గోల్డ్ మెడల్ మ్యాచ్ ఆడాల్సి ఉన్నది. అయితే వినేశ్ ఫోగట్ డిస్క్వాలిఫై అయిన నేపథ్యంలో.. భారత ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) స్పందించారు. వినేశ్, నువ్వ చాంపియన్లకే చాంపియన్ అంటూ ఆయన ఎక్స్ అకౌంట్లో కామెంట్ చేశారు. భారత దేశానికి గర్వకారణమని, ప్రతి ఒక్క భారతీయుడికి ప్రేరణగా నిలుస్తున్నావని తెలిపారు.
నిజానికి వేటు పడడం అది ఎంతో బాధిస్తుందన్నారు. చాలా నిరాశకు లోనయ్యానని, ఆ విషయాన్ని మాటల్లో చెప్పలేమన్నారు. నువ్వు మరింత పట్టుదలతో రాణిస్తావని ఆశిస్తున్నట్లు చెప్పారు. సవాళ్లను ఎదుర్కోవడం నీ నైజమని ఆయన అన్నారు. మరింత బలంతో పుంజుకోవాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. నీకు మేం అందరం సపోర్టుగా ఉంటామని మోదీ తన ట్వీట్లో వెల్లడించారు.
50 కేజీల ఫ్రీ స్టయిల్ రెజ్లింగ్‌లో పోటీ చేసిన వినేశ్ ఫోగట్.. ఫైనల్‌కి ప్రవేశించింది. కానీ సుమారు 100 గ్రాముల అధిక బరువు నమోదు కావడంతో.. ఆమెపై వేటు విధించారు. దీంతో భారత ఒలింపిక్ బృందంలో నిరాశలు నెలకొన్నాయి.
వినేశ్ విషయంలో భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. అసలు ఏం జరిగిందో ఆయన అడిగి తెలుసుకున్నారు. అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం వద్ద తమ నిరసన వ్యక్తం చేయాలని పీటీ ఉషను మోదీ కోరినట్లు తెలుస్తోంది.
Vinesh, you are a champion among champions! You are India’s pride and an inspiration for each and every Indian.
Today’s setback hurts. I wish words could express the sense of despair that I am experiencing.
At the same time, I know that you epitomise resilience. It has always…
— Narendra Modi (@narendramodi) August 7, 2024
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

