హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) ఆధ్వర్యంలో జరుగుతున్న అండర్-14 బాలుర వన్డే టోర్నీలో యువ క్రికెటర్లు దుమ్మురేపుతున్నారు. మంగళవారం సెయింట్ మేరీస్ టౌన్హైస్కూల్తో జరిగిన మ్యాచ్లో గౌతమ్ వరల్డ్ స్కూల్ 196 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత అర్జున్ మహాదేవ్(125 నాటౌట్), కెప్టెన్ శ్రేయాస్(115) సెంచరీలతో గౌతమ్ స్కూల్ 50 ఓవర్లలో 408/4 స్కోరు చేసింది. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన సెయింట్ మేరీస్ 46.3 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది.