వాషింగ్టన్: అమెరికాలోకి వలసలను పదేండ్ల పాటు పూర్తిగా స్తంభింపచేయాలని ట్రంప్ మాజీ సలహాదారు, మాగాకు పెద్ద మద్దతుదారైన స్టీవ్ బన్నన్ పిలుపునిచ్చారు. ప్రస్తుత వ్యవస్థ తక్కువ సంస్కరణలతో, అవినీతితో కూడి ఉందని.. వలసదారుల సమస్యను ఇది పూర్తిగా పరిష్కరించలేదని ఆయన తెలిపారు. తన వార్ రూమ్ షోలో ఆయన ఇటీవల మాట్లాడుతూ వలసదారుల కట్టడికి హెచ్-1బీ వీసాలను ముగించడాన్ని దాటి ముందుకు వెళ్లాలన్నారు. పన్ను చెల్లింపుదారుల డబ్బును వలసదారుల సంక్షేమానికి ఖర్చు పెడుతున్నారని.. వ్యవస్థను వ్యవస్థీకృత నెట్వర్క్లు ఎలా దుర్వినియోగం చేస్తున్నాయనే దానికి ఇది నిదర్శనమన్నారు. హెచ్-1బీ ప్రోగ్రాం అమెరికా ఉద్యోగులను ధ్వంసం చేసే చర్య అని విమర్శించారు. ప్రస్తుతం అమెరికాలో విదేశీ విద్యార్థులు చదువుకోవాల్సిన అవసరం లేదని ఆయన అక్కసు వెళ్లగక్కారు.