టెహరాన్: ఇరాన్లో ఆర్థిక సంక్షోభం దేశంలో అస్థిరతకు దారితీసింది. రెండు రోజులుగా ఇరాన్‌లోని దాదాపు అన్ని నగరాలు, పట్టణాల్లో ప్రజలు రోడ్లమీదికి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. అయతుల్లా అలీ ఖమేనీ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘ముల్లాలు దేశం వీడాలి’, ‘నియంతృత్వం నశించాలి’ అంటూ నినాదాలు చేస్తున్నారు. దేశంలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడంతో కరెన్సీ విలువ దారుణంగా పడిపోవడంతోపాటు నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. డాలర్‌తో మారకం విలువ భారత్‌లో రూ.90 వరకూ ఉండగా, ఇరాన్లో అది 42,000 రియాల్స్‌కు చేరుకుంది. ద్రవ్యోల్బణం 42 శాతం దిగువకు పడిపోయింది. దీంతో ఆహారం, ఔషధాలు, నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగిపోయాయి. ఇప్పటికే అటు ఇజ్రాయెల్, ఇటు అమెరికా ఉమ్మడిగా తమ అణు స్థావరాలపై జరిపిన దాడితో ఇరాన్ అతలాకుతలమైంది.