Vinesh Poghat : రాజకీయాల్లో అడుగుపెట్టిన మాజీ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ (Vinesh Phogat) అసెంబ్లీ ఎన్నికల కసరత్తు మొదలెట్టింది. హర్యానాలోని జులనా(Julana) నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్న రోడ్‌షోలు నిర్వహిస్తూ.. ప్రత్యర్థులపై మాటల తూటాలు పేలుస్తోంది. అయితే.. రాజకీయాల్లో వడివడిగా అడుగులు వేస్తున్న వినేశ్‌కు పెద్ద షాక్ తగిలింది. యాంటీ డోపింగ్ ఏజెన్సీ (NADA) ఆమెకు నోటీసులు పంపింది. 14 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని నాడా వినేశ్‌ను కోరింది. అసలు ఏం జరిగిందంటే..?
ఈమధ్యే ముగిసిన పారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్లో వినేశ్ ఫొగాట్ అనర్హతకు గురైన విషయం తెలిసిందే. 100 కిలోల అదనపు బరువు కారణంగా ఆమె పసిడి పోరు నుంచి వైదొలగాల్సి వచ్చింది. అయితే.. సెప్టెంబర్‌లో నెలలో నాడా వినేశ్ శాంపిల్స్ తీసుకోవాలని భావించింది. కానీ, తమకు చెప్పిన ప్రాంతంలో వినేశ్ అక్కడ లేదని నాడా ఆరోపిస్తోంది. అందుకనే గురువారం నాడా ఆమెకు నోటీసులు పంపింది. 14 రోజుల లోపు వినేశ్ తమకు వివరణ ఇవ్వాలని నాడా ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది.
The National Anti-Doping Agency (NADA) served a notice to wrestler-turned-politician #VineshPhogat for whereabouts failure and sought an explanation within 14 days
Know more🔗https://t.co/S69uEqP3Cj pic.twitter.com/Fdzhyta7n4
— The Times Of India (@timesofindia) September 25, 2024
పారిస్ ఒలింపిక్స్‌లో 51 కిలోల విభాగంలో పోటీ పడిన వినేశ్ అనూహ్యంగా పతకం చేజార్చుకుంది. తొలి పోరులోనే జపాన్ రెజ్లర్‌కు షాకిచ్చిన వినేశ్ అలవోకగా ఫైనల్ చేరింది. కానీ, ఊహించని విధంగా 100 కిలోల అదనపు బరువు ఆమె పతకం ఆశల్ని కూల్చేసింది. దాంతో, క్రీడా కోర్టులో ఆమె తనకు జరిగిన అన్యాయాన్ని సవాల్ చేసింది. అక్కడా కూడా ఆమెకు న్యాయం దక్కలేదు.
దాంతో, పుట్టెడు బాధలో మునిగిపోయిన వినేశ్ లండన్‌లో ఉండగానే రెజ్లింగ్‌కు వీడ్కోలు పలికింది. ఆ తర్వాత స్వదేశం వచ్చిన ఆమెకు విమానాశ్రయంలో, సొంతగ్రామంలో జనం హారతి పట్టారు. వినేశ్‌ను ఓ యోధురాలిగా గుర్తిస్తూ ఆమెకు గోల్డ్ మెడల్ అందజేశారు కూడా. ఇక.. వీధి పోరాటాల ద్వారా రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌ను ఎదుర్కోలేమని గ్రహించిన ఆమె రాజకీయాలే అస్త్రమని నిర్ణయించుకుంది. అందుకనే కాంగ్రెస్‌లో చేరి రాజకీయంగానే భూషణ్‌కు దడ పుట్టించేందుకు వినేశ్ పావులు కదుపుతోంది.