అమరావతి : దసరా ఉత్సవాలు (Dussehra festival) సమీపిస్తుండడంతో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఏపీ ఆర్టీసీ(APS RTC ) ప్రత్యేక బస్సులను నడిపేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది. అక్టోబర్ 3 నుంచి 12 వ తేదీవరకు జరుగనున్న శరన్నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్(Hyderabad) తో పాటు విజయవాడ(Vijayawada) కు వచ్చే రాజమహేంద్రవరం, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై కు ప్రత్యేక బస్సులను నడపనుంది.
ముఖ్యంగా హైదరాబాద్లో నివాసించే ఆంధ్రవాసులు దసరా సెలవులకు స్వస్థలాలకు వెళ్లనున్నందున విజయవాడ నుంచి హైదరాబాద్కు 353 బస్సులను నడపాలని నిశ్చయించింది . రాజమహేంద్రవరానికి 241, విశాఖపట్నంకు 90, బెంగళూరుకు 14, చెన్నైకు 22, ఇతర ప్రాంతాలకు 244 బస్సులను నడుపనున్నారు. అక్టోబర్ 15వ తేదీ వరకు 13 రోజుల పాటు బస్సులను నడుపనున్నట్లు అధికారులు వెల్లడించారు.