Abhishek Sharma | టీమిండియా యువ కెరటం అభిషేక్ శర్మ విజయ్ హజారే ట్రోఫీలో విధ్వంసం సృష్టించాడు. పంజాబ్‌కు కెప్టెన్‌గా కొనసాగుతున్న శర్మ సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో సంచలన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. కేవలం బంతుల్లోనే శతకొట్టాడు. మ్యాచ్‌లో 96 బంతుల్లో 170 పరుగుల భారీ స్కోరు చేశాడు. ఇందులో ఎనిమిది సిక్సర్స్, 22 ఫోర్లు ఉన్నాయి. 177.80 స్ట్రయిక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. మరో పంజాబ్ ఆటగాడు ప్రభ్సిమ్రాన్ సింగ్ సైతం 95 బంతుల్లో 125 పరుగులు చేశాడు. ఇద్దరు పంజాబ్ బ్యాటర్స్ బ్యాటింగ్ విధ్వంసంతో పంజాబ్ జట్టు 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 424 పరుగులు భారీ స్కోర్‌ను సాధించింది. ప్రభ్ సిమ్రాన్ సింగ్, అభిషేక్ శర్మ ఇద్దరు కలిసి 298 పరుగుల రికార్డు ఓపెనింగ్ భాగస్వామ్యం నమోదు చేశారు.
విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో ఇది రెండో అత్యధిక భాగస్వామ్యం కాగా.. 2022లో బెంగాల్‌కు చెందిన సుదీప్-అభిమన్యు ఈశ్వరన్ 298 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఆ తర్వాత భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన సౌరాష్ట్ర సైతం ధాటిగానే బ్యాటింగ్‌ను ప్రారంభించింది. చివరకు 367 పరుగులకే ఆలౌటైంది. ఇదిలా ఉండగా.. అభిషేక్ శర్మ ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం విధితమే. గత సీజన్లో ఓపెనర్‌గా వచ్చి భారీ ఇన్నింగ్స్‌తో అభిమానులను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత టీమిండియా టీ20 జట్టులో కూడా చోటు దక్కింది. ప్రస్తుతం యువ ఆటగాడికి మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ మెంటార్‌గా ఉన్నాడు. యూవీ మార్గదర్శకత్వంలో అభిషేక్ రాణిస్తున్నాడు.