వడోదర: రంజీ ట్రోఫీ-2024 సీజన్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన ముంబైకి షాకిచ్చేందుకు విదర్భ అన్ని అస్ర్తాలనూ సిద్ధం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్లో రహానే సేనను 270 పరుగులకే ఆలౌట్ చేసి 113 పరుగుల భారీ ఆధిక్యాన్ని దక్కించుకున్న విదర్భ.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 147/4 స్కోరు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 260 పరుగుల ఆధిక్యంలో ఉంది.
యశ్ రాథోడ్ (59 బ్యాటింగ్), కెప్టెన్ అక్షయ్ (31 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. మరో రెండు రోజులు మిగిలున్న ఈ మ్యాచ్లో విదర్భను ఆలౌట్ చేయడంతో పాటు లక్ష్యాన్ని ఛేదించడం ముంబైకి అంత తేలిక కాదు. ఒకవేళ ఈ మ్యాచ్ డ్రాగా ముగిసినా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో విదర్భ ఫైనల్కు దూసుకెళ్తుంది. ఇక కేరళతో జరుగుతున్న మరో సెమీస్లో గుజరాత్ దీటుగా బదులిస్తోంది. ఫస్ట్ ఇన్నింగ్స్లో కేరళ 457 పరుగుల భారీ స్కోరు చేయగా గుజరాత్ 222/1 స్కోరు చేసింది.