Virat Kohli | భారత్ స్టార్ క్రికెటర్, పరుగుల రారాజు విరాట్ కోహ్లీ (Virat Kohli ) ఫిట్నెస్కి అధిక ప్రాధాన్యం ఇస్తాడన్న విషయం అందరికీ తెలిసిందే. నిరంతరం కష్టపడుతూ తన శరీరాన్ని దృఢంగా ఉంచుకుంటాడు. ఫిట్‌నెస్‌లో భారత క్రికెట్ జట్టు సభ్యులందరూ విరాట్‌ను స్ఫూర్తిగా తీసుకుంటారు. వ్యాయామం, డైట్‌కు అంతలా ప్రాధాన్యమిస్తాడు ఈ స్టార్ బ్యాట్స్‌మెన్. డైట్లో భాగంగా ఈ స్టార్ ఆటగాడు పూర్తిగా వెజిటేరియన్ (Vegetarian)గా మారిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా విరాట్ ‘చికెన్ టిక్కా’ (Chicken Tikka) తిని అందరినీ ఆశ్చర్యపరిచాడు.
ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాధాన్యం ఇచ్చే విరాట్.. దాని కోసమే గతంలో వెజిటేరియన్‌గా మారాడు. పలు ఆరోగ్య సమస్యలు కూడా విరాట్‌ను వెజిటేరియన్‌గా మారేలా చేశాయి. ఈ విషయాన్ని కోహ్లీనే పలు సందర్భాల్లో చెప్పాడు. అయితే, తాజాగా తాను ‘చికెన్ టిక్కా’ తిన్నట్లు సోషల్ మీడియలో ఓ పోస్ట్ పెట్టాడు. ‘ఈ మాక్ చికెన్ టిక్కా (mock chicken tikka)ను మీరు తప్పక ఇష్టపడతారు’ అంటూ ఫొటోకి క్యాప్షన్ ఇచ్చాడు. ఇది చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ‘ఇదేంటి.. కోహ్లీ పూర్తిగా శాఖాహారి కద..? మరి ఇప్పుడేంటి చికెన్ టిక్కా తిన్నారు’, ‘కోహ్లీ అబద్ధం చెప్పాడా..?’ అంటూ కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు.
Virat Kohli loves the “Chicken Tikka” 🍴#ViratKohli #CricketTwitter #KingKohli #Cricket pic.twitter.com/611fIdtkhn
— Niche Sports (@Niche_Sports) December 12, 2023
అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే..? కోహ్లీ తిన్నది పూర్తిగా వెజిటేరియన్ ఫుడే. నెటిజన్స్ ‘చికెన్ టిక్కా’ అన్న పదాన్ని మాత్రమే చూశారు తప్ప ‘మాక్ చికెన్ టిక్కా’ అన్న విషయాన్ని ఎవరూ గుర్తించలేకపోయారు. దీనిపై ఓ అభిమాని క్లారిటీ ఇచ్చాడు. ‘కొంతమందికి చికెన్ టిక్కాకు, మాక్ చికెన్ టిక్కాకు తేడా తెలియదు. మాక్ చికెన్ టిక్కా పూర్తిగా వెజిటేరియన్ ఫుడ్. ఇది ఓ మొక్క నుంచి తయారు చేసిన ఆహారం. అది తెలియని వారు కోహ్లీ నాన్‌వెజ్ తిన్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు’ అని సమాధానం ఇచ్చాడు.
Some people on Twitter really don’t understand the difference between Chicken tikka and Mock chicken tikka (a kinda plant food)
and started controversy against Virat Kohli for eating non veg. 🤣😭 pic.twitter.com/rplyX4QPmq— Akshat (@AkshatOM10) December 12, 2023
వాస్తవానికి ‘మాక్ చికెన్ టిక్కా’ నాన్‌వెజ్ కాదు. పేరులో చికెన్ టిక్కా ఉన్నంత మాత్రాన చికెన్‌తో తయారు చేసిన ఫుడ్ కాదిది. దీనిని తయారు చేయడానికి సోయాను వాడతారు. ఓరకంగా చెప్పాలంటే.. ఇది వెజిటేరియన్లకు నాన్‌వెజ్ ఫుడ్. రుచి పరంగా చికెన్ టిక్కాకు, మాక్ చికెన్ టిక్కాకు పెద్దగా తేడా ఏమీ ఉండదు. అందుకే మాంసాహారం మాక్ వెర్షన్‌ను సోయాతోనే తయారు చేస్తారు. మాంసం తినని వాళ్లు ఇలాంటి ఫుడ్‌నే ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు. అందులో భాగంగానే కోహ్లీ కూడా ‘మాక్ చికెన్ టిక్కా’ ను తీసుకుంటుంటారు.
Also Read..
Security breach | లోక్‌సభలో భద్రతా వైఫల్యం.. టియర్ గ్యాస్ ప్రయోగించిన ఆగంతకులు
MS Dhoni | ఫ్రెండ్ బర్త్‌డే పార్టీలో ధోనీ సందడి.. వీడియో
NIA Raids | బెంగళూరులో ఎన్ఐఏ అధికారుల సోదాలు