MS Dhoni | భారత మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) ప్రస్తుతం లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఈ మిస్టర్ కూల్.. తన విలువైన సమయాన్ని ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నారు. అప్పుడప్పుడూ ఫ్రెండ్స్‌తో సరదాగా గడుపుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా మహి తన ఫ్రెండ్ బర్త్‌డే పార్టీకి హాజరై సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
టీమిండియా గొప్ప కెప్టెన్లలో ధోనీ పేరు ముందువరసలో ఉంటుంది. అతడి సారథ్యంలోనే భారత్ మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచింది. 2019 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో ధోనీ రనౌటయ్యాడు. ఆ క్షణమే ఆటకు రిటైర్మెంట్ ఇవ్వాలని అనుకున్నాడు. అయితే, 2020 ఆగస్టులో 42ఏళ్ల ఈ మిస్టర్ కూల్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం ఐపీఎల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. 16వ సీజన్లో ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఐదోసారి ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఆ లీగ్ తప్ప మిగతా ఏడాదంతా ధోనీ క్రికెట్‌కు దూరంగానే ఉంటున్నాడు. అయినప్పటికీ తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు. ధోనీకి కార్లు, బైక్స్ అంటే మహా పిచ్చి. సమయం దొరికనప్పుడల్లా రాంచీ వీధుల్లో కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా రైడ్‌కు వెళ్తుంటాడు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. వాటిని చూసి అభిమానులు తెగ మురిసిపోతుంటారు.
Also Read..
NIA Raids | బెంగళూరులో ఎన్ఐఏ అధికారుల సోదాలు
Mohan Yadav | మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ ప్రమాణం
Parliament attack | పార్లమెంట్‌పై ఉగ్రదాడికి 22 ఏళ్లు.. అమరులకు నివాళులర్పించిన నేతలు