NTR |టాలీవుడ్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఛాంపియన్’ పై అంచనాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. కొత్త దర్శకుడు ప్రదీప్ అద్వైతం తెరకెక్కిస్తున్న ఈ పీరియాడిక్ డ్రామాలో మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్గా నటిస్తోంది. సుమారు రూ.40 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేయగా, మేకర్స్ కూడా ప్రమోషన్స్‌ను ఒక రేంజ్లో నిర్వహించారు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నుంచి సపోర్ట్ లభించింది. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఎన్టీఆర్ తన పోస్ట్‌లో, “నా ‘స్టూడెంట్ నంబర్ 1’ నుంచి ఇప్పుడు వస్తున్న ‘ఛాంపియన్’ సినిమా వరకు స్వప్న సినిమా కొత్త గొంతుకలను ప్రోత్సహిస్తూనే ఉంది. వాళ్లు చేసే ప్రతి సినిమా వెనుక సినిమాపై ఉన్న అమితమైన ప్రేమ స్పష్టంగా కనిపిస్తుంది. స్వప్న దత్ నాకు ఎప్పుడూ అండగా ఉంటుంది. నేను కూడా స్వప్న టీమ్‌కు ఎప్పుడూ సపోర్ట్‌గా ఉంటాను. రోషన్, అనస్వర రాజన్, ప్రదీప్ అద్వైతంకు ఆల్ ది బెస్ట్. 2025 ముగింపులో ఈ సినిమా ఒక మెమరబుల్ హిట్‌గా నిలవాలని ఆశిస్తున్నాను” అంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో నుంచి వచ్చిన ఈ సపోర్ట్‌తో ‘ఛాంపియన్’ సినిమాపై మరింత హైప్ ఏర్పడింది. ఫ్యాన్స్‌తో పాటు సినీ వర్గాలు కూడా ఈ చిత్రంపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ సినిమాలో నటిస్తున్నారు. ఇంటర్నేషనల్ లెవల్లో రూపొందుతున్న ఈ మూవీలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తోంది. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఎన్టీఆర్ లుక్స్‌కు అభిమానుల నుంచి భారీ రెస్పాన్స్ రావడంతో, సినిమా రిలీజ్ తర్వాత ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది.