బర్మింగ్‌హామ్: ఆసక్తికరంగా సాగుతున్న యాషెస్ తొలి టెస్టుకు వరుణుడు ఆటంకం కలిగించాడు. ఇంగ్లండ్ 393/8 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా.. ఆదివారం ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 386 పరుగులకు ఆలౌటైంది. ఉస్మాన్ ఖవాజా (141) శతక్కొట్టగా.. కారీ (66), కమిన్స్ (38) రాణించారు.
ఇంగ్లండ్ బౌలర్లలో బ్రాడ్, రాబిన్సన్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. దీంతో ఇంగ్లండ్‌కు 7 పరుగుల స్వల్ప తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. మూడో రోజు వర్షం వల్ల ఆట నిలిచే సమయానికి 2 వికెట్ల నష్టానికి 28 పరుగులు చేసింది.