పాట్నా: యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి బంపరాఫర్ దక్కింది. బుధవారం నుంచి మొదలుకాబోయే రంజీ సీజన్‌కు గాను అతడు బీహార్ రంజీ జట్టుకు వైస్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. గత సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా గెలవకపోవడంతో ఈ సీజన్లో బీహార్ ప్లేట్ డివిజన్‌కు పడిపోయింది.
సకిబుల్ గని సారథిగా ఉన్న బీహార్.. ఈనెల 15 నుంచి అరుణాచల్ ప్రదేశ్‌తో తమ తొలి మ్యాచ్‌ను ఆడనుంది.