India Under -19 Team : ఐపీఎల్లో రికార్డు సెంచరీతో సంచలనం సృష్టించిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) మరోసారి మెరుపు బ్యాటింగ్‌తో అలరించాడు. ఇంగ్లండ్ అండర్ -19 జట్టుపై విధ్వంసక ఆటతో చెలరేగిన వైభవ్ భారత జట్టు అద్భుత విజయంలో కీలక పాత్ర పోషించాడు. శుక్రవారం జరిగిన తొలి యూత్ వన్డే మ్యాచ్‌లో ఆయుశ్ మాత్రే సారథ్యంలో యంగ్ ఇండియా ఆతిథ్య జట్టుకు షాకిచ్చింది. మొదట ప్రత్యర్థిని స్వల్ప స్కోర్‌కే ఆలౌట్ చేసిన టీమిండియా.. ఆరు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. నాలుగు వన్డేల మ్యాచ్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
ఇంగ్లండ్ పర్యటనలో భారత అండర్ -19 జట్టు అదిరే బోణీ కొట్టింది. నాలుగు వన్డేల సిరీస్ తొలి పోరులో అతిథ్య జట్టును చిత్తు చిత్తుగా ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్‌కు భారత బౌలర్లు ముచ్చెమటలు పట్టించారు. స్పిన్ ద్వయం కనిష్క్ చౌహన్(3-20), మహమ్మద్ ఇనాన్(2-37)లు తిప్పేయగా.. పేసర్లు అంబ్రిష్(2-24), హెనిల్ పటేల్(2-41)లు వికెట్ల వేట కొనసాగించారు. రాకీ ఫ్లింటాఫ్ అర్ధ శతకంతో రాణించగా ఇంగ్లండ్ 42.2 ఓవర్లలో 174 పరుగులకే ఆలౌటయ్యింది.
14-year-old Vaibhav Suryavanshi backs up his IPL 2025 show with some more fearless hitting in another standout knock ⚡
Scorecard 👉 https://t.co/6xZLFl3LFS pic.twitter.com/7bqX0xZ6oJ
— ESPNcricinfo (@ESPNcricinfo) June 27, 2025
అనంతరం బ్యాటింగ్‌లో ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ(48: 19 బంతులు) తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. కెప్టెన్ ఆయుష్ మాత్రే(21)తో ఇన్నింగ్స్ ఆరంభించిన అతడు తొలి వికెట్‌కు ఏడు ఓవర్లలోనే 70 రన్స్ రాబట్టాడు. మాత్రే ఔటయ్యాడక వైస్ కెప్టెన్ అభిజ్ఞాన్ కుందు 45 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. 24 ఓవర్లలోనే మ్యాచ్ ముగించిన భారత జట్టు సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళ్లింది.