Samsung Galaxy M36 5G | గెలాక్సీ సిరీస్‌లో సరికొత్త మిడ్‌రేంజ్ ఫోన్‌ను లాంచ్ చేసిన శాంసంగ్.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..?
స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలన్నీ మిడ్ రేంజ్ కస్టమర్లను ఆకర్షించేందుకు అద్భుతమైన ఫీచర్లు కలిగిన ఫోన్లను బడ్జెట్ ధరలోనే అందిస్తున్నాయి. అందులో శాంసంగ్ విషయానికి వస్తే కాస్త వెనుకబడే ఉందని చెప్పవచ్చు.
Samsung Galaxy M36 5G | స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలన్నీ మిడ్ రేంజ్ కస్టమర్లను ఆకర్షించేందుకు అద్భుతమైన ఫీచర్లు కలిగిన ఫోన్లను బడ్జెట్ ధరలోనే అందిస్తున్నాయి. అందులో శాంసంగ్ విషయానికి వస్తే కాస్త వెనుకబడే ఉందని చెప్పవచ్చు. అయితే ఇదే రేంజ్లో మరో నూతన స్మార్ట్ ఫోన్‌ను శాంసంగ్ భారత్‌లో రిలీజ్ చేసింది. గెలాక్సీ ఎం36 5జి పేరిట శాంసంగ్ ఓ నూతన మిడ్ రేంజ్ ఫోన్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్లో 6.7 ఇంచుల ఇన్ఫినిటీ-యు సూపర్ అమోలెడ్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ ఉండడంతోపాటు 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్లో ఎగ్జినోస్ 1380 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. అలాగే ఫోన్‌ను ఎంత ఎక్కువ ఉపయోగించినా హీట్ అవకుండా ఉండేందుకు ప్రత్యేక వేపర్ కూలింగ్ చాంబర్‌ను ఏర్పాటు చేశారు.
6 ఏళ్ల వరకు అప్డేట్స్..
ఈ ఫోన్లో వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉండగా దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనే ఫీచర్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఫోన్ షేక్ అవుతున్నా పర్ఫెక్ట్ గా చిత్రాలు, వీడియోలను షూట్ చేసుకోవచ్చు. అలాగే హెచ్డీఆర్కు సపోర్ట్‌ను కూడా ఈ కెమెరాకు అందిస్తున్నారు. వెనుక వైపు మరో 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరా కూడా ఉంది. మరో 2 మెగాపిక్సల్ మాక్రో సెన్సార్‌ను కూడా ఇచ్చారు. ఇక ఈ ఫోన్లో వినియోగదారులకు ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. దీనికి గాను 6 ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ను, 6 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్డేట్స్ను అందిస్తామని శాంసంగ్ చెబుతోంది. ఈ ఫోన్ కు గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఫోన్ కింద పడ్డా అంత సులభంగా పగలదు.
భారీ బ్యాటరీ, సన్నని డిజైన్..
ఇక ఈ ఫోన్ చాలా సన్నని డిజైన్‌ను కలిగి ఉంటుంది. దీని మందం 7.7ఎంఎం మాత్రమే కావడం విశేషం. ఈ ఫోన్లో 5000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి 25 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. అయితే చార్జర్‌ను మాత్రం వినియోగదారులు ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ ఫోన్ 6జీబీ, 8జీబీ ర్యామ్, 128జీబీ, 256జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో లాంచ్ అయింది. డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు. ముందు వైపు 12 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.3, యూఎస్బీ టైప్ సి వంటి అదనపు ఫీచర్లను కూడా కస్టమర్లు ఈ ఫోన్లో పొందవచ్చు.
ధర వివరాలు..
శాంసంగ్ గెలాక్సీ ఎం36 5జి స్మార్ట్ ఫోన్ ఆరెంజ్ హేజ్, వెల్వెట్ బ్లాక్, సెరీన్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో లాంచ్ అయింది. ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.17,499 ఉండగా, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.17,999గా ఉంది. అలాగే టాప్ ఎండ్ మోడల్ 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.20,999గా ఉంది. ఈ ఫోన్‌ను అమెజాన్‌తోపాటు శాంసంగ్ ఇండియా ఆన్లైన్ స్టోర్, పలు ఎంపిక చేసిన స్టోర్లలో జూలై 12 నుంచి విక్రయించనున్నారు. లాంచింగ్ సందర్బంగా పలు ఆఫర్లను కూడా అందిస్తున్నారు. ఎంపిక చేసిన బ్యాంకులకు చెందిన కార్డులతో ఈ ఫోన్‌ను కొంటే రూ.1000 వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

