కొండాపూర్, జూన్ 27 : న్యాయం, సంస్కరణల కోసం కలిపే గొంతుల పోరాటాన్ని వినిపించేలా ప్రముఖ చట్ట పరిజ్ఞాన, సామాజిక సంస్కర్త డాక్టర్ ధరణికోట సుయోధన్ రచించిన దిశ పుస్తకాన్ని శుక్రవారం నాలెడ్జ్ సిటీలోని టీ హబ్ లో ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి సినీ నటి హెబ్బా పటేల్, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ మంజుల అనగానీ, వివిధ రంగాల నిపుణుల మధ్య పుస్తకాన్ని ఆవిష్కరించారు. దిశ కల్పిత కథనే అయినప్పటికీ, అనేక నిజజీవితాలా పరావలంబన, న్యాయం అందనిచోట చట్టం ఏం చేస్తుందన్న ప్రశ్నని లేవనెత్తుతుందనీ రచయిత సుయోధన్ తెలిపారు.