కోదాడ, జూన్ 27 : కోదాడ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కృషిచేస్తున్నట్లు ఎమ్మెల్యే పద్మావతి పేర్కొన్నారు. శుక్రవారం కోదాడలోని క్యాంప్ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల కాలంలో రూ.2000 కోట్లతో నియోజకవర్గంలోని పలు రంగాలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. నీటినపారుదల రంగా అభివృద్ధికి రూ.66:50 కోట్లు రోడ్లు భవనాల అభివృద్ధికి 279 కోట్లు, పీఆర్సిఆర్ఆర్ ఎమ్మార్, ఆర్ఎస్టిఎస్డిఎఫ్ రంగాలకు 1509 కోట్లు వెచ్చించినట్లు పేర్కొన్నారు.
కోదాడ పెద్ద చెరువు టూరిజానికి ఐదు కోట్లతో అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తున్నామని పేర్కొన్నారు. ఇందులో కొన్ని పనులు మొదులు కాగా.. మరికొన్ని ప్రారంభం కానున్నాయని, వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు. నియోజకవర్గంలోని సమస్యలను ఎప్పటికప్పుడు సమీక్షించి పరిష్కారం చేస్తానని ఆమె ప్రజలకు భరోసా ఇచ్చారు. పారదర్శకంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.