Usman Qadir : పాకిస్థాన్ దిగ్గజ స్పిన్నర్ కుమారుడు అయిన ఉస్మాన్ ఖాదిర్ (Usman Qadir ) దేశం తరఫున ఆడలేనంటూ వీడ్కోలు పలికాడు. మూడేండ్లా కాలంలో పాక్ జెర్సీ వేసుకొని ఒక్కటే వన్డే ఆడిన అతడు అనూహ్యంగా కెరీర్ ముగించాడు. అన్ని ఫార్మాట్లలో పాకిస్థాన్ క్రికెట్‌కు గుడ్ బై చెబుతున్నట్టు గురువారంఉస్మాన్ ప్రకటించాడు. లెగ్ స్పిన్నర్ అయిన ఉస్మాన్ పాక్ పాక్ లెజెండరీ స్పిన్నర్ అబ్దుల్ ఖాదిర్ కుమారుడు.
‘ఈ రోజుతో నేను పాకిస్థాన్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నా. ఈ సందర్బంగా దేశం తరఫున ఆడే అవకాశం దక్కినందుకు గర్వ పడుతున్నా. నాకు ఎంతగానో సహకరించిన కోచ్‌లు, జట్టు సభ్యులకు ధన్యవాదాలు. చిరస్మరణీయ విజయాల నుంచి మర్చిపోలేని సవాళ్ల వరకూ… మీతో పంచుకున్న అనుభవాలు నా కెరీర్‌ను.. నా జీవితాన్ని గొప్పగా మలిచాయి. ఎల్లవేళలా ప్రోత్సహించిన అభిమానులకు కృతజ్ఞతలు’ అని ఉస్మాన్ తన పోస్ట్‌లో వెల్లడించాడు.
— Usman Qadir (@Qadircricketer) October 3, 2024
దిగ్గజ ఆటగాడి వారసుడైన ఉస్మాన్‌కు మొదట పాక్ జట్టులో చోటు దక్కలేదు. దాంతో, అతడు 2017-18 మధ్య ఆస్ట్రేలియాకు మకాం మార్చి.. అక్కడ దేశవాళీలో పశ్చిమ ఆస్ట్రేలియా(Western Australia) జట్టుకు ఆడాడు. అనంతరం స్వదేశం వచ్చిన ఉస్మాన్ కెరీర్ గొప్పగా సాగుతుందని అనుకున్నారంతా. పైగా కెప్టెన్ బాబర్ ఆజాం(Babar Azam) అతడికి మంచి స్నేహితుడు.
Legspinner Usman Qadir, who played 25 T20Is and one ODI for Pakistan, has announced his retirement at the age of 31
Full story: https://t.co/ZWSVqlhcjg pic.twitter.com/NhLmVoa6c8
— ESPNcricinfo (@ESPNcricinfo) October 3, 2024
కానీ.. ఉస్మాన్ ఊహించినట్టు ఏమీ జరుగలేదు. 2020లో పాక్ తరఫున అరంగేట్రం చేసిన ఉస్మన్ మూడేండ్లలో ఒక వన్డే, 25 టీ20లు ఆడాడంతే. నిరుడు ఆసియా క్రీడల్లో అతడు చివరిసారిగా దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. అయితే.. సెలెక్టర్లు తాను గాయపడినప్పుడు తగు విధంగా స్పందించలేదని వాపోయిన ఉస్మాన్.. ఆ తర్వాత ఐదు నెలల్లోనే పాక్ జట్టుకు గుడ్ బై చెప్పేశాడు.