Irani Cup 2024 : ముంబై, రెస్టాఫ్ ఇండియాల మధ్య ఇరానీ కప్(Irani Cup 2024) రసవత్తరంగా సాగుతోంది. లక్నో వేదికగా ఇరుజట్లు ‘నువ్వానేనా’ అన్నట్టు పోటీ పడుతున్నాయి. రెండో రోజు సర్ఫరాజ్ ఖాన్(222) డబుల్ సెంచరీతో విజృంభించగా ముంబై భారీ స్కోర్ సాధించింది. అనంతరం రెస్టాఫ్ ఇండియా ఆదిలో తడబడినా అభిమన్యు ఈశ్వరన్(155) అజేయ శతకంతో కోలుకుంది. కీలక భాగస్వామ్యాలు నెలకొల్పిన అభిమన్యు ఫస్ట్ క్లాస్‌లో 36వ సెంచరీతో జట్టును పటిష్ఠ స్థితిలో నిలిపాడు.
ముంబైని 563కు ఆలౌట్ చేసిన రెస్టాఫ్ ఇండియా ఇన్నింగ్స్ ధాటిగానే మొదలెట్టింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(9), అభిమన్యు ఈశ్వరన్ (151 నాటౌట్: 222 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్సర్)లు తొలి వికెట్‌కు 40 రన్స్ జోడించారు. అయితే.. 27 బంతుల్లో 9 పరుగలే చేసిన గైక్వాడ్‌ను జునైద్ ఖాన్ వెనక్కి పంపి ముంబైకి బ్రేకిచ్చాడు. ఆ తర్వాత వచ్చిన సాయి సుదర్శన్(32) అండగా అభిమన్యు కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. రెండో వికెట్‌కు 83 పరుగులు చేసిన ఈ జోడీని తనుష్ కొతియాన్ విడదీశాడు.
Another action-packed day!
Rest of India move to 289/4 on the back of a splendid 151* from Abhimanyu Easwaran.
They trail by 248 runs with Easwaran & Dhruv Jurel (30*) at the crease.#IraniCup | @IDFCFIRSTBank
Follow the match ▶️ https://t.co/Er0EHGOZKh pic.twitter.com/bReWj4aeaH
— BCCI Domestic (@BCCIdomestic) October 3, 2024
ఆ తర్వాత దేవ్‌దత్ పడిక్కల్(16) నిరాశపరచగా.. దులీప్ ట్రోఫీలో శతకంతో మెరిసిన ఇషాన్ కిషన్(38) క్రీజులో నిలదొక్కుకున్నా సరే భారీ స్కోర్ కొట్టలేకపోయాడు. అయినా సరే.. అభిమన్యు జోరు మాత్రం తగ్గించలేదు. ధ్రువ్ జురెల్(30 నాటౌట్) జతగా మరో కీలక భాగస్వామ్యంతో స్కోర్ బోర్డును నడిపించాడు. వీళ్లిద్దరూ 61 పరుగులు జోడించడంతో.. మూడోరోజు ఆట ముగిసే సరికి రెస్టాఫ్ ఇండియా నాలుగు వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. ఇంకా గైక్వాడ్ సేన 248 పరుగులు వెనకబడి ఉంది.