Brahmotsavam | తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి : టీటీడీ ఈవో
Brahmotsavam | తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీటీడీ ఈవో జె. శ్యామలరావు చెప్పారు.
తిరుమల : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు (Brahmotsavam) అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీటీడీ ఈవో(TTD EO) జె. శ్యామలరావు చెప్పారు. భక్తుల సౌకర్యార్థం టీటీడీలోని అన్ని విభాగాల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.
ఈవో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపటి నుంచి 12వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం, రాత్రి వాహనసేవను నిర్వహిస్తున్నామని వెల్లడించారు. విశేష ఉత్సవాలను తిలకించేందుకు వచ్చే భక్తకోటికి టీటీడీ అనేక ఏర్పాట్లను చేసిందన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయంలో పలు ఆర్జితసేవలు రద్దు చేసినట్లు పేర్కొన్నారు. బ్రేక్ దర్శనం(Break darsan) స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే పరిమితం చేశామని, గరుడసేవ రోజు అక్టోబరు 8న బ్రేక్ దర్శనాలు పూర్తిగా రద్దు చేసినట్లు వివరించారు.
ప్రతిరోజూ 24 వేలు సర్వదర్శనం టోకెన్లు ..
భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రోజుకు 7 లక్షల లడ్డూలను నిల్వ ఉంచామన్నారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు 1. 32 లక్షల రూ.300ను దర్శన టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. తిరుపతిలో ప్రతిరోజూ సర్వదర్శనం టోకెన్లు 24 వేలు అందుబాటులో ఉన్నాయి. దాదాపు 1, 250 మంది టీటీడీ నిఘా భద్రతా సిబ్బంది, 3,900 పోలీసు సిబ్బందితో బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. లక్షలాది భక్తులు వాహనసేవలు వీక్షించేందుకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో గ్యాలరీలు సుందరంగా తీర్చిదిద్దామన్నారు. తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో 9 వేల వాహనాలకు సరిపడా పార్కింగ్ ఏర్పాట్లు చేశామని వివరించారు.
తిరుమలలో సామాన్య భక్తుల కోసం 6,282 గదులు అందుబాటులో ఉన్నాయి. సాధారణ రోజుల్లో 1,580 గదులు ఆన్లైన్లో భక్తులకు కేటాయిస్తామని, బ్రహ్మోత్సవాల్లో వీటిని 50 శాతానికి తగ్గించడం జరిగిందన్నారు. స్వయంగా వచ్చే కాటేజి దాతలకు మాత్రమే గదులు కేటాయించడం జరుగుతుంది. అక్టోబరు 8న గరుడసేవ సందర్భంగా అక్టోబరు 7, 8వ తేదీలలో కాటేజి దాతలకు కూడా ఎలాంటి గదుల కేటాయింపు ఉండదన్నారు.
అక్టోబరు 3 నుంచి 12వ తేదీ వరకు ఎలాంటి సిఫార్సు లేఖలపై గదులు కేటాయించబడదని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జేఈవోలు గౌతమి, వీర బ్రహ్మం, సివిఎస్ఓ శ్రీధర్, సీఈ సత్యనారాయణ, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

