Multi Zone-2 | ఇసుక అక్రమ రవాణా కట్టడిలో విఫలం.. సీఐలు, ఎస్ఐలపై వేటు వేసిన ఐజీ..!
Multi Zone-2 | మల్టీజోన్-2లోని తొమ్మిది జిల్లాల పరిధిలో ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేయడంలో విఫలమైన పోలీసులపై ఐజీ వీ సత్యనారాయణ చర్యలు చేపట్టారు. ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్ఐలను వీఆర్‌లో పెడుతూ ఉత్తర్వులు జారీ చేశారు.
Multi Zone-2 | మల్టీజోన్-2లోని తొమ్మిది జిల్లాల పరిధిలో ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేయడంలో విఫలమైన పోలీసులపై ఐజీ వీ సత్యనారాయణ చర్యలు చేపట్టారు. ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్ఐలను వీఆర్‌లో పెడుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఓ సీఐ, 14 మంది ఎస్ఐలను బదిలీ చేశారు. తాజాగా సంగారెడ్డి రూరల్, తాండూరు రూరల్, తాండూర్ టౌన్ సీఐలతో పాటు వీపనగండ్ల, బిజినేపల్లి, తెలకపల్లి, వంగూరు, ఉప్పనూతల, సంగారెడ్డి రూరల్, పెద్దేముల్, యాలాల్, తుంగతుర్తి, ఆత్మకూర్(S), పెన్ పహాడ్, వాడపల్లి, హాలియా ఎస్ఐలను వేకెన్సీ రిజర్వ్‌లో పెట్టారు. కొందరు అధికారులకు ఇసుక రవాణాలో ప్రత్యక్ష, పరోక్ష సహకారం ఉందని.. ఈ క్రమంలో వారిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. త్వరలో వీరందరినీ లూప్లైన్కు బదిలీ చేయనున్నట్లు చెప్పారు.
ఇప్పటికే అడవిదేవీపల్లి, వేములపల్లి, నార్కట్‌పల్లి, చండూర్, మాడుగులపల్లి, తిప్పర్తి, చింతలపాలెం, తిరుమలగిరి, నాగారం, జాజిరెడ్డిగూడెం, అచ్చంపేట్, బొంరాస్‌పేట్, తాండూర్, చిన్నంబావి ఎస్‌లను బదిలీ చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఇసుక అక్రమ రవాణాతో ప్రభుత్వ ఆదాయానికి గండిపతుతుందని.. వాగులు, నిషేధిత నదీ ప్రాంతాల్లో విచక్షణా రహితంగా ఇసుకను తవ్వితే పర్యావరణ సమత్యులతకు భంగం వాటిల్లే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వంతో పాటు డీజీపీ అక్రమ రవాణాపై సీరియస్‌గా ఉన్న నేపథ్యంలో చర్యలు తీసుకున్నట్లు ఇసుక అక్రమ రవాణాకు సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సిందేనన్నారు. అలాగే ఇసుక అక్రమ రవాణా వసూళ్లకు పాల్పడిన కొండమల్లేపల్లి హోంగార్డ్, జడ్చర్ల కానిస్టేబల్‌ను డీఏఆర్కి అటాచ్ చేసినట్లు చెప్పారు. వీటితో పాటు పీడీఎస్ బియ్యాన్ని అక్రమ రవాణా చేసినా చర్యలుంటాయన్నారు. బాధ్యతాయుతమైన సర్కిల్ ఇన్స్పెకర్గా పని చేస్తూ ఓ మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో అలసత్యం వహించిన, దర్యాప్తులో అవకతవకలకు పాల్పడిన వికారాబాద్ టౌన్ సీఐ ఏ నాగరాజును సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tyson Naidu | బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘టైసన్ నాయుడు’ నుంచి ‘మదరాసి రబ్బరు బొమ్మ’ మాస్ ఫోక్ సాంగ్ అప్డేట్!
AP News | మురసు తుపాను ఎఫెక్ట్.. రేపు కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు..!
Ear Wax | గులిమి అంటే ఏమిటి.. దీని వల్ల లాభమా, నష్టమా.. తరచూ తొలగించాలా..?
Health tips | గుండె పదిలంగా ఉండాలంటే వంటలో తరచూ ఈ మార్పులు చేయాల్సిందే..!
AP News | జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రేపే పోలింగ్.. సర్వం సిద్ధం చేశామన్న ఎన్నికల కమిషనర్..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

