PCB : టీ20 కెప్టెన్‌గా బాబర్ ఆజాం (Babar Azam) వైదొలగడంతో పాకిస్థాన్ క్రికెట్ సంక్షోభాన్ని తారాస్థాయికి తీసుకెళ్లింది. వరల్డ్ కప్ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ బాబర్ రాజీనామా చేయడంతో ఆ దేశ బోర్డు కొత్త సారథి వేటలో పడింది. సీనియర్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ (Mohammad Rizwan), ఫఖర్ జమాన్ (Fakhar Zaman)లలో ఒకరు బాబర్ వారసుడిగా ఎంపికవ్వడం ఖాయమనే వార్తలు వినిపించాయి.
అయితే.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) కీలక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇకపై మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లను నియమించాలనే ఉద్దేశంతో పీసీబీ ఉన్నట్టు పాక్ మీడియా మీడియా వర్గాలు చెబుతున్నాయి. నిరుడు వన్డే వరల్డ్ కప్ తర్వాత మొదలైన కెప్టెన్సీ రగడకు పుల్‌స్టాప్ పెట్టాలని పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi) భావిస్తున్నాడు. అందుకని ఇకపై మూడు ఫార్మాట్లకు ముగ్గురు సారథులు ఉంటే బాగుంటుందని ఆయన అభిప్రాయ పడుతున్నాడు.
The PCB confirms Babar Azam has stepped down as Pakistan men’s white-ball captain.
Read more: https://t.co/DssgToUXrR pic.twitter.com/31rJOxYuYy
— Pakistan Cricket (@TheRealPCB) October 2, 2024
సెలెక్టర్ల బృందం.. మాజీల సలహా మేరకు వన్డేలు, టీ20, టెస్టులకు ముగ్గురు కెప్టెన్ల నియామకం దిశగా పీసీబీ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతానికి బాబర్ స్థానంలో వన్డే, టీ20 కెప్టెన్‌గా మహ్మద్ రిజ్వాన్ ఎంపికయ్యే అవకాశం ఉంది. అతడికి డిప్యూటీగా ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్ రేసులో ఉన్నాడు. అయితే.. వన్డే వరల్డ్ కప్ తర్వాత పొట్టి ఫార్మాట్ పగ్గాలు అందుకున్న పేసర్ షాహీన్ ఆఫ్రిదికి మరో అవకాశం ఇస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
టెస్టు కెప్టెన్ షాన్ మసూద్(Shan Masood)ను కొనసాగించాలా? వద్దా? అనే విషయమై కూడా పీసీబీ కీలక నిర్ణయం తీసుకోనుంది. ఎందుకంటే.. మసూద్ సారథ్యంలోని పాక్ తాజాగా బంగ్లాదేశ్ చేతిలో టెస్టు సిరీస్‌ను 2-0తో కోల్పోయింది. అందుకనే ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల మాదిరిగా మూడు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్ల నియామకం దిశగా పీసీబీ ఆలోచిస్తోంది. అయితే.. ఎప్పుడు నిర్ణయం అనేది తెలియాల్సి ఉంది.