Pawan Kalyan | మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రస్తుతం అమాయకుడిలా నటిస్తున్నాడని.. గత ఐదేళ్లలో ఆయన చేసిన పనులను.. గతంలో ఉన్న అవినీతి కేసులను జాతీయ మీడియా ఓసారి గుర్తు చేసుకోవాలని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. తిరుపతిలో నిర్వహించిన వారాహి డిక్లరేషన్ సభలో జగన్‌పై విమర్శలు గుప్పించారు. జగన్ కోర్టులను అవమానించిన వ్యక్తి, జడ్జిలపై అసభ్యకర వ్యాఖ్యలు చేయించిన వ్యక్తి అని విమర్శించారు. ఎన్నికల అధికారిని దూషించిన దూషించారని.. వ్యవస్థలంటే ఆయనకు గౌరవం లేదన్నారు. కోర్టులతో ఎన్నోసార్లు చీవాట్లు తిన్నారన్నారు. జగన్‌పై ఉన్న కేసులన్నీ చాలా తీవ్రమైనవని.. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. జగన్‌పై 32 కేసులు ఉన్నాయన్న పవన్.. 16 నెలలు జైలుజీవితం అనుభవించారన్నారు. బెయిల్‌పై బయట ఉన్న వ్యక్తి అని వ్యక్తిని నమ్ముతామా? అంటూ ప్రశ్నించారు. మాజీ సీఎంపైగా ఉన్న కేసులను త్వరగా విచారణ జరిపి.. చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాలను కోరుతున్నానన్నారు.
తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌పై పవన్ కల్యాణ్ పరోక్షంగా మండిపడ్డారు. సనాతన ధర్మానికి భంగం కలిగితే తాను బయటకు వచ్చి పోరాడుతాన్నారు. అవసరమైతే ప్రాణత్యాగం చేస్తానని.. పదవి పోయినా భయపడనన్నారు. సనాతన ధర్మం వైరస్ లాంటిదని, ఆ మహమ్మారిని నిర్మూలించాలని ఈ మధ్య ఓ యువ నాయకుడు మాట్లాడుతున్నాడని.. సనాతన ధర్మాన్ని ఎవరూ ఏమీ చేయలేరన్నారు. ఎవరైనా సరే దాన్ని నిర్మూలించాలకుంటే, వారే తుడిచిపెట్టుకుని పోతారన్నారు. తిరుమల వేంకటేశ్వరస్వామి సాక్షిగా ఈ మాటలు చెబుతున్నానన్నారు. సనాతన ధర్మంపై జరుగుతున్న దాడులను న్యాయస్థానాలు సమర్థిస్తున్నాయని.. ధర్మంపై దాడులు చేస్తున్న వారిని కోర్టులు కాపాడడం బాధాకరమని వ్యాఖ్యానించారు.