Gujarat Titans : మాజీ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) ఫ్రాంచైజీ యాజమాన్యం మారబోతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలానికి ముందే సీవీసీ (CVC) క్యాపిటల్ పార్ట్నర్స్ కంపెనీ ఫ్రాంచైజీలో తమ వాటాను గంపగుత్తగా అమ్మేసేందుకు సిద్ధమైంది. అహ్మదాబాద్‌కే చెందిన టోరెంటో గ్రూప్ (Torrent Group)గుజరాత్‌ను త్వరలోనే హస్తగతం చేసుకోనుంది. దాంతో, పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ (Adanai Group)కు గట్టి షాక్ తగిలింది.
అహ్మదాబాద్ ఫ్రాంచైజీని 2021లో సొంతం చేసుకునే అవకాశాన్నిగుజరాత్, టొరెంట్ గ్రూప్‌లు కోల్పోయాయి. దాంతో, ఈసారి ఎలాగైనా టీమ్‌ను కొనాలని రెండు గ్రూప్‌లు పట్టుదల కనబరిచాయి. దాంతో, ఇంతకంటే మంచి సమయం దొరకదేమోనని సీవీసీ కంపెనీకి అనుకుంది. 2021లో సీవీసీ గ్రూప్ రూ.5,625 కోట్లకు గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీని కొన్నది. అప్పుడు గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ రూ.5,100 కోట్లకు బిడ్డింగ్ వేయగా.. టోరెంటో కంపెనీరూ.4,653 కోట్లకు వేలంలో పాల్గొంది.
Torrent to acquire a majority stake in the Gujarat Titans, while CVC is expected to retain a significant minority stake. Gautam Adani’s Adani Group backs out of the race. #IPL #GujaratTitans #AdaniGroup #TorrentGroup #CVC pic.twitter.com/7Dd0z7oQ3H
— Javed Farooqui (@journojaved) September 13, 2024
మరి ఇప్పుడు ఎంత ధరకు సీవీసీ గ్రూప్ తమ వాటాను అమ్మనుందనేది మాత్రం తెలియలేదు. అయితే.. సీవీసి రూ. 83 కోట్ల నుంచి రూ 1.25 లక్షల కోట్ల మధ్య డిమాండ్ చేస్తోందని సమాచారం. ఐపీఎల్‌లోని కొత్త ఫ్రాంచైజీ యజమానులు తమ వాటాను అమ్ముకునేందుకు 2025 ఫిబ్రవరి వరకూ బీసీసీఐ అనుమతిచ్చింది. దాంతో, నిర్దేశించిన గడువు లోపే కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని టోరెంటో గ్రూప్ భావిస్తోంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ అడుగుపెట్టి మూడేండ్లు అవుతోంది. తొలి సీజన్లో హార్దిక్ పాండ్యా (Hardhik Pandya) సారథ్యంలో గుజరాత్ అదరగొట్టింది. సంచలన విజయాలతో ఫైనల్ చేరిన గుజరాత్ ఏకంగా చాంపియన్‌గా అవతరించింది. డిఫెండింగ్ చాంపియన్‌గా 16వ సీజన్ ఆడిన గుజరాత్ మళ్లీ టైటిల్ పోరుకు దూసుకెళ్లింది.
అయితే.. చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. 17వ సీజన్ మినీ వేలానికి ముందు హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ (Mumbai Indians)కు అప్పగించి గుజరాత్ పెద్ద మూల్యమే చెల్లించుకుంది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలో బరిలోకి దిగిన ఆ జట్టు చెత్త ఆటతో నిరాశపరిచింది. సీనియర్ పేసర్ మహ్మద్ షమీ లేకపోవడం, టాపార్డర్ వైఫల్యంలో ప్లే ఆఫ్స్ చేరలేకపోయింది. అందుకని 18వ సీజన్లో పకడ్బందీగా టైటిల్ వేటకు సిద్ధమవ్వాలని గిల్ బృందం భావిస్తోంది.