Suma | తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు భారీ రెమ్యునరేషన్లు తీసుకుంటున్నారంటూ తరచూ విమర్శలు వినిపిస్తుంటాయి. అటెన్షన్ సీకర్స్ కొందరు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తేలిగ్గా ట్రోల్ చేస్తూ ఉంటారు. కానీ అదే హీరోలు ఎలాంటి ప్రచారం లేకుండా చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి మాత్రం చాలా అరుదుగా మాట్లాడతారు. తాజాగా అలాంటి ఒక తెలియని నిజాన్ని టాలీవుడ్ టాప్ యాంకర్ సుమ కనకాల బయటపెట్టడంతో అది నెట్టింట వైరల్‌గా మారింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రెబల్ స్టార్ ప్రభాస్ ఇద్దరూ కలిసి ఖమ్మంలో ఒక వృద్ధాశ్రమ నిర్మాణానికి ఎంతో సహాయం చేశారని సుమ కనకాల తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో వీరిద్దరితో పాటు మరికొందరు కూడా సహకరించారని, అయితే ముఖ్యంగా పవన్ కళ్యాణ్, ప్రభాస్ చేసిన సాయం ఎంతో విలువైనదని సుమ పేర్కొన్నారు. ఇందులో మరింత హృదయాన్ని తాకే విషయం ఏమిటంటే.. ప్రభాస్ ఆ వృద్ధాశ్రమంలో నివసిస్తున్న పెద్దల యోగక్షేమాల కోసం ప్రతి నెలా ఆర్థిక సహాయం పంపిస్తున్నారని సుమ వెల్లడించారు. ఎలాంటి ప్రచారం లేకుండా, ఎవరికీ తెలియకుండా ప్రభాస్ ఇలా నెలనెలా సహాయం చేయడం ఆయన దయా హృదయానికి నిదర్శనమని ఆమె కొనియాడారు.సుమ చేసిన ఈ రివీల్‌తో పవన్ కళ్యాణ్, ప్రభాస్‌లపై అభిమానుల్లో గౌరవం మరింత పెరిగింది. ఒకవైపు సినిమాల విషయంలో ట్రోల్స్ ఎదుర్కొంటూ, మరోవైపు సమాజానికి ఉపయోగపడే పనులు నిశ్శబ్దంగా చేయడం నిజమైన స్టార్డమ్ అంటే ఇదేనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
భారీ రెమ్యునరేషన్లు, స్టార్ స్టేటస్ గురించి మాత్రమే మాట్లాడే వారు.. ఇలాంటి సేవల గురించి మాత్రం పట్టించుకోకపోవడం బాధాకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. సుమ కనకాల బయటపెట్టిన ఈ సీక్రెట్ సేవా కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారి తీస్తూ, పవన్ కళ్యాణ్, ప్రభాస్‌లను మరోసారి గ్రేట్ హ్యూమన్స్‌గా నిలబెట్టింది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ చిత్రం జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుండగా, పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం మార్చిలో రిలీజ్ కానుంది.