దోహా: చెస్ చాంపియన్ మ్యాగ్నస్ కార్ల్సన్(Magnus Carlsen) మళ్లీ తన సహనాన్ని కోల్పోయారు. వరల్డ్ ర్యాపిడ్ చెస్, వరల్డ్ బ్లిట్జ్ చాంపియన్ అయిన కార్ల్సన్.. తాజాగా దోహలో జరుగుతున్న ఫిడే వరల్డ్ బ్లిట్జ్ చాంపియన్‌షిప్‌లో ఓటమిని తట్టుకోలేక ఆవేశానికి గురయ్యాడు. టేబుల్‌ను అతను బలంగా కొట్టాడు. భారత గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఎరిగయిసి చేతిలో ఓడిన నార్వే చెస్ గ్రాండ్‌మాస్టర్ మ్యాగ్నస్ కోపంతో క్వీన్ పావును పడేశాడు.
గ్రాండ్‌మాస్టర్ అర్జున్ తన టెక్నిక్‌తో చాంపియన్ ప్లేయర్ కార్ల్‌సన్‌కు షాక్ ఇవ్వడంతో అతను టెంపర్ కోల్పోయాడు. జూన్ నెలలో కూడా ఇలాగే మ్యాగ్నస్ తన సహనాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే. నార్వే చెస్ టోర్నీలో వరల్డ్ చాంపియన్ డీ గుకేశ్ చేతిలో ఓడిన తర్వాత అతను ఆవేశాన్ని ఆపుకోలేకపోయాడు. దోహాలో జరిగిన కార్ల్సన్ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతున్నది.
భారతీయ ప్లేయర్ అర్జున్ తన దూకుడు స్టయిల్ ఆటతో ఇప్పటికే 8 విక్టరీలు నమోదు చేశాడు. రెండు మ్యాచ్‌లు డ్రా అవ్వగా, ఒక దాంట్లో ఓడిపోయాడు. 9వ రౌండ్లో కార్లసన్‌ను ఓడించడంతో అతను కీలక పొజిషన్లోకి వచ్చేశాడు. బ్లాక్ పీస్‌లతో అతను మ్యాగ్నస్ను ఓడించాడు. ఈ ఏడాది కార్ల్‌సన్‌ను రెండోసారి ఓడించాడు అర్జున్. నార్వే చెస్ టోర్నీలోని క్లాసికల్ ఫార్మాట్లో కార్ల్‌సన్‌ను ఓడించాడు.
Oops!…He Did It Again#RapidBlitz pic.twitter.com/O5N5CWoO2f
— International Chess Federation (@FIDE_chess) December 29, 2025