అమరావతి : విజయవాడలో(Vijayawada) వెలసిన దుర్గామల్లేశ్వర(Durgamalleshwara) స్వామివార్ల దేవస్థానం హుండీలకు రూ. 82.03లక్షల ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు వెల్లడించారు. 15 రోజుల ఆదాయాన్ని(Income) లెక్కించగా రూ. 82.03,392 లు వచ్చిందని ఆలయ డిప్యూటీ ఈవో లీలాకుమార్ తెలిపారు.
బంగారం 145 గ్రాములు, 1.870 గ్రాముల వెండి వస్తువులను భక్తులు మొక్కల రూపంలో చెల్లించుకున్నారని వివరించారు. 136 యూఎస్ఏ డాలర్లు(USA Dollors) , 20 ఇంగ్లండ్ పౌండ్లు, 40 కెనడా డాలర్లు, 25 కువైట్ దీనార్లు, 20 హాంకాంగ్ డాలర్లు వచ్చినట్లు తెలిపారు. ఆలయ ఈవో రామారావు, ఆలయ అధికారులు కానుకల లెక్కింపును పర్యవేక్షించారు.