శుక్రవారం 03 జూలై 2020
Sports - May 17, 2020 , 20:39:19

అది తొంద‌ర‌పాటే

అది తొంద‌ర‌పాటే

కోహ్లీ-బాబ‌ర్ మ‌ధ్య పోలిక‌పై యూనిస్ ఖాన్‌

క‌రాచీ:  టీమ్ఇండియా కెప్టెన్ విరా‌ట్ కోహ్లీ.. పాకిస్థాన్ ఆటగాడు బాబ‌ర్ ఆజ‌మ్‌ల‌ను పోల్చ‌డం తొంద‌ర‌పాటు అవుతుందని పాక్ మాజీ కెప్టెన్ యూనిస్ ఖాన్ అభిప్రాయ‌ప‌డ్డాడు. ఇటీవ‌లే వ‌న్డే జ‌డ్డుకు కెప్టెన్‌గా ఎంపికైన బాబ‌ర్.. విరాట్‌ను చేరాలంటే ఇంకా చాలా స‌మ‌యం ప‌డుతుంద‌ని యూనిస్ ఖాన్ పేర్కొన్నాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 70 శ‌త‌కాలు బాది.. కెరీర్‌లోనే ఉచ్చ స్థితిలో ఉన్న కోహ్లీతో బాబ‌ర్‌ను పోల్చ‌డం స‌రైన విష‌యం కాద‌ని అత‌డు అన్నాడు.

`కోహ్లీ కెరీర్ ప్రారంభించి ద‌శాబ్దం దాటిపోయింది. ఫార్మాట్‌ల‌తో సంబంధం లేకుండా అత‌డు ఇప్ప‌టికే 20 వేల అంత‌ర్జాతీయ ప‌రుగులు చేశాడు. అండులో 70 శ‌త‌కాలు ఉన్నాయి. ప్ర‌స్తుత త‌రంలో అత‌డు అత్యుత్త‌మ ఆట‌గాడు. ఇందులో సందేహం లేదు. మ‌రోవైపు చూసుకుంటే బాబ‌ర్ ఆజ‌మ్ జ‌ట్టులోకి వ‌చ్చిన నాలుగైదేండ్లు అయింది. అత‌డి వ‌య‌సు 25. ఇంకా చాలా కెరీర్ ఉంది. ఇప్పుడ‌ప్పుడే ఈ ఇద్ద‌రి మ‌ధ్య పోలిక తేవ‌డం స‌రైంది కాదు` అని యూనిస్ ఖాన్ అన్నాడు.


logo