Parenting | సమ్మర్లో చదువును కూడా సరదాగా నేర్పించాలి
వేసవి వచ్చిందంటే చాలు.. బయట భానుడి భగభగలు, ఇంట్లో పిల్లల చిటపటలు. స్కూళ్లకి సెలవులు ఇవ్వగానే అమ్మమ్మ, నాయనమ్మల ఇళ్లకు పరిగెత్తే రోజులు పోయాయి. ఈతరం పిల్లలంతా ఇంట్లో కూర్చుని ఫోన్లు, టీవీలు చూడటం, వీడియో గేమ్‌లు ఆడటానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు.
Parenting | వేసవి వచ్చిందంటే చాలు.. బయట భానుడి భగభగలు, ఇంట్లో పిల్లల చిటపటలు. స్కూళ్లకి సెలవులు ఇవ్వగానే అమ్మమ్మ, నాయనమ్మల ఇళ్లకు పరిగెత్తే రోజులు పోయాయి. ఈతరం పిల్లలంతా ఇంట్లో కూర్చుని ఫోన్లు, టీవీలు చూడటం, వీడియో గేమ్‌లు ఆడటానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. స్క్రీన్ టైమ్ పెరగడంతో పిల్లల్లో అనేక మానసిక, శారీరక సమస్యలు తలెత్తుతున్నాయి. వాటికి విరుగుడు సమ్మర్ క్యాంపులే..
- శారీరక, మానసిక వ్యాయామాలను అందించే సమ్మర్ క్యాంపులు పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు సాయపడతాయంటున్నారు నిపుణులు. అయితే పిల్లలకు ఆహ్లాదం, ఆనందాన్ని అందించే సమ్మర్ క్యాంపుల ఎంపికలో జాగ్రత్త తప్పనిసరి.
- పిల్లలు కొత్త విషయాలు నేర్చుకునేందుకు సమ్మర్ క్యాంపులు తోడ్పడతాయి. కొన్ని క్యాంపుల్లో పిల్లల అభిరుచుల ఆధారంగా రకరకాల యాక్టివిటీస్‌ని వారితో చేయిస్తారు. తద్వారా వారు ఆ పనులను ఇష్టంగా చేస్తారు. ఇది వారిలో ఏకాగ్రత పెరగడానికి దోహదపడుతుంది.
- కొందరు తల్లిదండ్రులు వారి పిల్లలకు రాబోయే తరగతి పుస్తకాలను అందించి ఇప్పటినుంచే చదవమని ప్రోత్సహిస్తారు. కానీ అది ముమ్మాటికీ తప్పంటున్నారు నిపుణులు. సమ్మర్ క్యాంపులో కూడా తరగతి పుస్తకాలు, హోమ్‌వర్క్ ఇచ్చి పిల్లలపై మరింత భారాన్ని మోపకూడదు.
- చదువును కూడా సరదాగా నేర్పించాలి. నంబర్ గేమ్స్, పెయింటింగ్, మట్టిపాత్రలు చేయడం, తోటి పిల్లలతో కలిసి ఆడుకోవడం, ఆహారాన్ని పంచుకొని తినడం, డ్యాన్స్, పాటలు, యోగా, ధ్యానం తదితర అంశాలపై దృష్టి పెట్టే క్యాంపులను ఎంచుకోవాలి.
- అసలు ఏ క్యాంపులోనూ చేర్చకపోయినా రోజుకు రెండు నుంచి మూడు గంటలపాటు తోటి పిల్లలతో ఆడుకునేలా చూడండి. తద్వారా తమలోని ఆలోచనలు, కళలకు ఓ రూపం ఇచ్చేందుకు ప్రోత్సహించండి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

