BAN vs SA 2nd Test : మిర్పూర్ టెస్టులో జయభేరి మోగించిన దక్షిణాఫ్రికా (South Africa) రెండో టెస్టులోనూ దంచేస్తోంది. తొలి రోజు బంగ్లాదేశ్ బౌలర్లను ఉతికేస్తే ఓపెనర్ టోనీ డీ జోర్జి(141 నాటౌట్), యువకెరటం ట్రిస్టన్ స్టబ్స్(106)లు శతకాలతో చెలరేగారు. ఈ ఇద్దరి జోరుతో సఫారీల స్కోర్ రాకెట్ వేగంతో పరుగులు తీసింది. బౌండరీలతో విరుచుకుపడిన స్టబ్స్ కెరీర్లో తొలి వంద కొట్టేసి బంగ్లాను వణికించాడు. మరోవైపు జోర్జి సెంచరీ తర్వాత కూడా దంచుడు ఆపలేదు. దాంతో, తొలిరోజు ఆట ముగిసే సరికి మర్క్రమ్ సేన 2 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది.
ఛత్తోగ్రామ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా పట్టుబిగిస్తోంది. తొలి రోజు సఫారీ కుర్రాళ్లు టోనీ డి జోర్జి(141 నాటౌట్ : 198 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ట్రిస్టన్ స్టబ్స్(106 : 211 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు)లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. బంగ్లాదేశ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ఇద్దరూ సెంచరీలతో గర్జించారు. టాస్ గెలిచన దక్షిణాఫ్రికా కెప్టెన్ ఎడెన్ మర్క్రమ్ బ్యాటింగ్ తీసుకోగా.. సఫారీ జట్టు తమ ఇన్నింగ్స్‌ను ధాటిగా మొదలెట్టింది. తొలి వికెట్‌కు ఓపెనర్ టోనీ డీ జోర్జితో కలిసి 69 పరుగులు జోడించిన మర్క్రమ్(33)ను తైజుల్ ఇస్లాం బోల్తా కొట్టించాడు.
de Zorzi’s day. Stubbs’ day. South Africa’s day. 🤝
🔗 https://t.co/zRhCZqpZjI | #BANvSA pic.twitter.com/kZvX4OusSn
— ESPNcricinfo (@ESPNcricinfo) October 29, 2024
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన స్టబ్స్ తన మార్క్ ఆటతో బంగ్లా బౌలర్లకు దడ పుట్టించాడు.మొదట జోర్జి శతకం సాధించగా.. స్టబ్స్ కూడా వందతో జట్టు స్కోర్ 250 దాటించాడు. సెంచరీ తర్వాత స్టబ్స్‌ను తైజుల్ బౌల్డ్ చేయడంతో బంగ్లా ఆటగాళ్లు ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. జోర్జీ మాత్రం జోరు తగ్గించకలేదు. డేవిండ్ బడింగ్హమ్(18) నిదానంగా ఆడడంతో దక్షిణాఫ్రికా ఆట ముగిసే సరికి 2 వికెట్లు కోల్పోయి 307 రన్స్ కొట్టింది.