VidaaMuyarchi | కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajithkumar) కాంపౌండ్ నుంచి వస్తోన్న చిత్రం విదాముయార్చి (Vidaa Muyarchi). మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఏకే 62గా వస్తోన్న ఈ చిత్రంలో త్రిష (Trisha) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ మూవీ 2025 జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ మూవీ టీజర్ అప్డేట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
విదాముయార్చి టీజర్‌ను నవంబర్ 10న లాంచ్ చేయనున్నారని కోలీవుడ్ సర్కిల్ సమాచారం. కాగా మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావడమే తరువాయి అని తెలుస్తోంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వస్తోన్న ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ సార్జా కీలక పాత్రలో నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ (Sanjaydutt) విలన్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే షేర్ చేసిన విదాముయార్చి పోస్టర్లు నెట్టింట చక్కర్లు కొడుతూ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి.
ఆరవ్ కీ రోల్ చేస్తుండగా.. స్టైలిష్ గాగుల్స్ పెట్టుకున్న ఆరవ్ ఓ ట్రక్కులో నుంచి దిగుతున్న పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. అర్జున్ స్టైలిష్ లుక్‌లో రోడ్డుపై నిలబడి ఉన్న లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. అజిత్ కుమార్ మరోవైపు అధిక్ రవిచంద్రన్ డైరెక్షన్లో ఏకే 63ను కూడా లైన్లో పెట్టాడు. గుడ్ బ్యాడ్ అగ్లీ టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది.
#VidaaMuyarchi TEASER NOV 10th🤞pic.twitter.com/SQvdHyByYO
— Venkatramanan (@VenkatRamanan_) October 29, 2024
Zebra | సత్యదేవ్ జీబ్రా కొత్త విడుదల తేదీ వచ్చేసింది..