Musi Project | మూసీ ప్రాజెక్టుపై వెనక్కి తగ్గేది లేదని.. నవంబర్ ఒకటో తేదీన పనులు ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. పునర్జీవ ప్రాజెక్టులో భాగంగా తొలిదశలో బాపూఘాట్ అభివృద్ధి చేస్తామన్నారు. మొదటి దశలో గండిపేట నుంచి బాపూఘాట్ వరకు పనులు చేపడుతామన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద గాంధీ విగ్రహాన్ని బాపూఘాట్లో నెలకొల్పుతామన్నారు. కేబుల్ బ్రిడ్జి, బరాజ్ ఏర్పాటు చేస్తామన్నారు. మల్లన్న సాగర్ నుంచి రూ.7వేలకోట్లతో నీటిని ఉస్మాన్ సాగర్‌కు మళ్లిస్తామన్నారు. అక్కడి నుంచి హిమాయత్ సాగర్‌కు పంపుతామన్నారు. ట్రంక్‌లైన్ కోసం వచ్చే నెలలో టెండర్లు పిలుస్తారన్నారు. బాపూఘాట్ వద్ద ఎస్టీపీలతో నీటిని శుద్ధి చేసి మూసీలోకి వదులుతామన్నారు.
మరో 15 రోజుల్లో ఎస్టీపీలకు టెండర్లు పిలుస్తామన్నారు. మూసీని మరొక సిటీగా అభివృద్ధి చేస్తానన్నారు. కన్సల్టెన్సీకి రూ.141కోట్లతో డీపీఆర్ తయారీకి ఒప్పందం కుదుర్చుకుంటామన్నారు. మూడునెలల్లో నివేదిక వస్తుందన్నారు. మూసీని ఎకో ఫ్రెండ్లీ, వెజిటేరియన్ కాన్సెప్ట్‌తో అభివృద్ధి చేస్తామన్నారు. మూసీ వెంట రిక్రియేషన్ సెంటర్లు, అంతర్జాతీయ వర్సిటీ, గాంధీ ఐడియాలజీ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. మూసీ వెంట రాత్రి 7 నుంచి ఉదయం 7 వరకు మార్కెట్ ఉండేలా ప్లాన్ చేస్తున్నామన్నారు. ముందు నేను కాన్సెప్ట్ డెవలప్ చేస్తున్నానని.. తర్వాత ప్రజలను ఒప్పిస్తానన్నారు. వాడపల్లి నుంచి వికారాబాద్ వరకు పాదయాత్ర చేస్తానన్నారు. మూసి నిర్వాసితులను ఆదుకుంటామన్నారు. మూసీపై కేటీఆర్, హరీశ్‌రావు, ఈటెల రాజేందర్‌కు ఏమేం కావాలో నాకు గానీ, డిప్యూటీ సీఎంకుగాని, సీఎస్‌కు గానీ చెప్పాలన్నారు.