e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 26, 2021
Home News Tokyo Olympics: పీవీ సింధు శుభారంభం

Tokyo Olympics: పీవీ సింధు శుభారంభం

టోక్యో: స్టార్‌ షెట్లర్‌ పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్‌లో శుభారంభం పలికింది. బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ తొలి మ్యాచ్‌లో ఇజ్రాయిల్‌ షట్లర్‌పై ఘన విజయం సాధించింది. ఇజ్రాయిల్‌ క్రీడాకారిణి సెనియా పొలికర్‌పోవ్‌తో జరిగిన మ్యాచ్‌లో వరుస గేమ్స్‌లో గెలుపొందింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత స్టార్‌ షెట్లర్‌కు పొలికర్‌ ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది. దీంతో సింధు 21-7, 21-10తో విజయం సాధించింది.

ఒలింపిక్స్‌ మూడో రోజు షూటర్లు నిరాశ పరిచినప్పట్టికీ రోయింగ్, బ్యాడ్మింటన్‌లో భారత్‌కు మంచి ఫలితాలు ఎదురయ్యాయి. రోయింగ్‌లో భారత రోయర్లు అరుణ్ లాల్​, అర్వింద్ సింగ్ అదరగొట్టారు. పురుషుల లైట్​వెయిట్ డబుల్ స్కల్స్ రెపిచేజ్ రౌండ్‌లో టాప్​-3లో నిలిచి సెమీఫైనల్‌కు అర్హత సాధించారు. ఈ పోటీలు జూలై 27న (మంగళవారం) జరగనున్నాయి.

- Advertisement -

మరోవైపు మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో భారత్‌కు చుక్కెదురయింది. స్టార్‌ షూటర్లు మను బాకర్, యశస్విని దేస్వాల్ టాప్-8కు అర్హత సాధించలేకపోయారు. దీంతో పతకం లేకుండానే ఇద్దరు నిష్క్రమించారు. మను బాకర్‌ 12వ స్థానంలో, యశస్విని 13 స్థానంలో నిలిచారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana