Frank Tyson | కింద పడేసి మోకాలితో తొక్కి.. అమెరికాలో మరో నల్లజాతీయుడిపై పోలీసుల దాష్టీకం
అమెరికాలో పోలీసులు మరోసారి దాష్టీకానికి పాల్పడ్డారు. 2020లో చోటుచేసుకొన్న ‘జార్జి ఫ్లాయిడ్' తరహాలోనే తాజాగా మరో దురాగతానికి ఒడిగట్టారు.
- అపస్మారక స్థితిలోకి వెళ్లి బాధితుడి మృతి
Frank Tyson | వాషింగ్టన్, ఏప్రిల్ 27: అమెరికాలో పోలీసులు మరోసారి దాష్టీకానికి పాల్పడ్డారు. 2020లో చోటుచేసుకొన్న ‘జార్జి ఫ్లాయిడ్’ తరహాలోనే తాజాగా మరో దురాగతానికి ఒడిగట్టారు. ఫ్రాంక్ టైసన్(53) అనే ఓ నల్లజాతీయుడిని కింద పడేసి.. మెడపై మోకాలితో గట్టిగా నొక్కిపెట్టి, ఊపిరాడకుండా చేసి అతని ప్రాణాలు తీశారు. ‘నాకు ఊపిరి ఆడటం లేదు’ అని బాధితుడు మొత్తుకున్నా పోలీసులు వదిలిపెట్టకుండా కర్కశంగా వ్యవహరించారు. ఓహియో రాష్ట్రంలోని కాంటన్ నగరంలో వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ప్రపంచాన్ని మరోసారి దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనకు సంబంధించిన బాడీ కెమెరా ఫుటేజ్‌ను కాంటన్ పోలీసు విభాగం గురువారం విడుదల చేసింది. టైసన్ పట్ల దారుణంగా వ్యవహరించిన పోలీసు అధికారులను బ్యూ స్కోనెగ్జ్, కామ్డెన్ బుర్చ్గా గుర్తించారు.
చేతులకు సంకెళ్లు వేసి కర్కశం
ఈ నెల 18న ఓ కారు ఎలక్ట్రిక్ పోల్‌ను ఢీకొట్టిన ఘటన జరిగింది. ఆ సమయంలో కారులో ఉన్న టైసన్‌ను సమీపంలోని ఓ బార్లోకి వెళ్లినట్లు పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసులు అనుమానించి అక్కడికి వెళ్లారు. వీడియో ఫుటేజ్ ప్రకారం టైసన్‌ను పట్టుకొన్న పోలీసులు అతని చేతులకు సంకెళ్లు వేసి, కింద పడేశారు. పోలీసు అధికారుల్లో ఒకరు టైసన్ మెడ సమీపంలోని వెనుక భాగంలో మోకాలు వేసి గట్టిగా నొక్కి పెట్టి ‘ఇప్పుడు బాగుందా!’ అంటూ వికృత ఆనందం పొందారు. ఆ తర్వాత కొంత సేపటికి టైసన్ చలనం లేకుండా పడిపోయాడు. దీంతో దవాఖానకు తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు.
గతంలో కూడా ఇదేవిధంగా..
2020లో కూడా ఇదే విధంగా పోలీసుల కర్కశత్వానికి జార్జిఫ్లాయిడ్ బలైన విషయం తెలిసిందే. ఆఫ్రో అమెరికన్ అయిన జార్జి ఫ్లాయిడ్ మెడపై డెరేక్ చౌవిన్ అనే పోలీసు అధికారి దాదాపు తొమ్మిది నిమిషాలకు పైగా మోకాలుతో తొక్కి పెట్టాడు. దీంతో అతను ఊపిరాడక మృతిచెందాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

