Tim Southee : న్యూజిలాండ్ టెస్టు జట్టు కెప్టెన్ టిమ్ సౌథీ అరుదైన ఘనత సాధించాడు. ఈ ఫార్మాట్లో అతను భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును సమం చేశాడు. టెస్టుల్లో 78 సిక్స్‌లతో సౌథీ, ధోనీ సరసన చేరాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో అతను ఈ రికార్డుకు చేరువయ్యాడు. స్టువార్ట్ బ్రాడ్ ఓవర్లో మిడాఫ్ దిశగా భారీ సిక్స్ కొట్టాడు. దాంతో, టెస్టుల్లో 78 సిక్స్‌లు తన ఖాతాలో వేసుకున్నాడు. వెస్టిండీస్ దిగ్గజం వివ్‌రిచర్డ్స్ (79 సిక్స్‌లు) రికార్డు బద్ధలు కొట్టడానికి కివీస్ కెప్టెన్ మరో సిక్స్‌ర్ దూరంలో నిలిచాడు.
ఈ ఫార్మాట్లో అత్యధిక సిక్సర్లు కొట్టింది ఎవరంటే.. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్కల్లమ్. ఈ విధ్వంసక ఓపెనర్ ఖాతాలో 107సిక్స్‌లు ఉన్నాయి. టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 91 సిక్సర్లతో ఈ జాబితాలో ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు.
1. బ్రెండన్ మెక్కల్లం – న్యూజిలాండ్ – 107 సిక్స్‌లు
2. ఆడం గిల్‌క్రిస్ట్ – ఆస్ట్రేలియా – 100 సిక్స్‌లు
3. బెన్ స్టోక్స్ – ఇంగ్లండ్ – 100 సిక్స్‌లు
4. క్రిస్ గేల్ – వెస్టిండీస్ – 98 సిక్స్‌లు
5. జాక్వెస్ కలిస్ – దక్షిణాఫ్రికా – 97 సిక్స్‌లు
6. వీరేంద్ర సెహ్వాగ్ – భారత్ – 91 సిక్స్‌లు
సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో మొదటి టెస్టులో కివీస్ ఓటమి పాలైంది. వెల్లింగ్టన్లో జరుగుతున్న రెండు టెస్టులోనూ ఓటమి నుంచి బయటపడేందుకు పోరాడుతోంది. మూడో రోజు ఆట ముగిసే సరికి 24 పరుగులు వెనకబడి ఉంది. ఇన్‌స్వింగ్ స్పెషలిస్ట్ జేమ్స్ అండర్సన్ ధాటికి మూడు వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్‌ను మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (25), హెన్రీ నికోలస్ (18) ఆదుకున్నారు. వీళ్లిద్దరూ నిదానంగా ఆడుతూ స్కోర్‌బోర్డును ముందుకు నడిపిస్తున్నారు. మొదటి ఇన్నింగ్స్‌లో కివీస్ 209కే ఆలౌట్ అయింది. ఆ తర్వాత బెన్ స్టోక్ 435-8 వద్ద ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. రెండో ఇన్నిగ్స్‌లో న్యూజిలాండ్ 3 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది.
That is some 𝗖𝗟𝗘𝗔𝗡 hitting 🏏
Tim Southee now equals MS Dhoni for number of Test match 6️⃣s with 78… #NZvENG pic.twitter.com/1qoa2odbMt
— Cricket on BT Sport (@btsportcricket) February 25, 2023