Tim David : ఆస్ట్రేలియా క్రికెటర్ టిమ్ డేవిడ్ (Tim David) పొట్టి ఫార్మాట్లో సంచలనం సృష్టించాడు. ఐపీఎల్లో విధ్వంసక బ్యాటింగ్‌తో అలరించిన ఈ డాషింగ్ బ్యాటర్ టీ20ల్లో తొలి శతకంతో గర్జించాడు. శనివారం వెస్టిండీస్ (West Indies) బౌలర్లను ఊచకోత కోసిన ఈ చిచ్చరపిడుగు ఆసీస్ తరఫున వేగవంతవైన సెంచరీ బాదేశాడు. మూడో టీ20లో కరీబియన్లు నిర్దేశించిన భారీ ఛేదనలో డేవిడ్ కేవలం 37 బంతుల్లోనే ఈ మూడంకెల స్కోర్‌కు చేరుకోగా… 23 బంతులు ఉండగానే విజేతగా నిలిచింది కంగారు జట్టు. వరుసగా మూడు విక్టరీలతో మరో రెండు మ్యాచులు ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది.
రెండుసార్లు పొట్టి వరల్డ్ కప్ ఛాంపియన్ వెస్టిండీస్‌కు వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. సొంత గడ్డపై చతికిలపడుతున్న షాయ్ హోప్ బృందం వరుసగా మూడో టీ20లోనూ ఓటమి పాలైంది. రెండొందలకు పైగా స్కోర్ చేసినా కూడా ఆసీస్ కుర్రాడు టిమ్ డేవిడ్ మెరుపు సెంచరీతో మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ 214 పరుగులు కొట్టింది. ఓపెనర్ బ్రాండన్ కింగ్(62) ఫిఫ్టీతో చెలరేగగా.. కెప్టెన్ హోప్ శతకం(102 నాటౌట్)తో మొదటి సెంచరీతో పోరాడగలిగే స్కోర్ అందించాడు.
🚀 First T20I hundred
🚀 Averaging 50 in the yearShai Hope is enjoying the format in 2025 ✨ pic.twitter.com/UepNBzhPxa
— ESPNcricinfo (@ESPNcricinfo) July 26, 2025
అనంతరం భారీ ఛేదనలో రొమారియో షెపర్డ్(2-39) ధాటికి ఆసీస్ ప్రధాన ఆటగాళ్లు విఫలమైనా టిమ్ డేవిడ్(102 నాటౌట్) విధ్వంసం కొనసాగించాడు. బంతి దొరకడమే ఆలస్యం బౌండరీకి తరలించడమే పనిగా విరుచుకుపడ్డాడు. ఈ చిచ్చరపిడుగు 37 బంతుల్లోనే శతకం సాధించాడు. దాంతో, ఆసీసీ తరఫున ఈ ఫార్మాట్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. డేవిడ్ విధ్వంసంతో 2023లో స్కాట్లాండ్ (Scotland)పై 43 బంతుల్లో జోష్ ఇంగ్లిస్ నెలకొల్పిన వేగవంతమైన శతకం రికార్డు బద్ధలైంది. కొండంత లక్ష్యం కూడా మంచు ముక్కలా కరిగిపోయింది. ఈ ఫార్మాట్లో చిరస్మరణీయ సెంచరీతో జట్టుకు ఆరు వికెట్ల విజయాన్ని అందించాడు డేవిడ్. అతడికి మిచెల్ ఓవెన్(36 నాటౌట్) సహకరించగా.. ఐదు టీ20ల సిరీస్‌ను కంగారు జట్టు సొంతం చేసుకుంది.
THE FASTEST T20I 50 IN AUSTRALIAN HISTORY! 🔥 🔥 🔥
Tim David absolutely monsters his way to the half-century off 16 balls.
Catch every ball of Australia’s tour of the West Indies live on ESPN on Disney+ 📺 pic.twitter.com/YY0AEj2xn7
— ESPN Australia & NZ (@ESPNAusNZ) July 26, 2025